స్త్రీ 2 తో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రద్ద కపూర్ గ్లామర్ విషయంలో కొత్తగా చెప్పుకునేది ఏమి ఉండదు, బాలీవుడ్ హీరోయిన్స్ గ్లామర్ విషయంలో ఎంతగా శ్రద్ద చూపిస్తారో కూడా వేరే చెప్పక్కర్లేదు. ఇప్పుడు శ్రద్ద కపూర్ కి ఓ బిగ్ ఆఫర్ తగిలింది. అది వార్ 2 లో స్పెషల్ సాంగ్ లో ఆడిపాడే అవకాశమొచ్చింది అనే టాక్ ఉంది.
హృతిక్ రోషన్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో ఆడిపాడే అవకాశాన్ని శ్రద్ద కపూర్ అందుకుంది, దాని కోసం చాలా ఎక్కువ మొత్తంలో పారితోషికం తీసుకుంది అనే ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలో శ్రద్ద కపూర్ నుంచి సోషల్ మీడియా షేక్ అవుతుందా అనేలాంటి గ్లామర్ పిక్ బయటికి వచ్చింది. శ్రద్ద కపూర్ ఆన్ ఫైర్ అనేలా ఉందా పిక్.
చిట్టిపొట్టి మోడ్రెన్ డ్రెస్ లో సింపుల్ గానే ఉన్నా ఆమె అందాలు బాగా హైలెట్ అవడంతో యూత్ మొత్తం శ్రద్ద కపూర్ పిక్ ని ట్రెండ్ చేస్తున్నారు. మీరు కూడా వార్ 2 స్పెషల్ పిక్ పై ఓ కనెయ్యండి.