కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతారకు - స్టార్ హీరో ధనుష్ కు మధ్యన కోల్డ్ వార్ కాదు డైరెక్ట్ వారే జరుగుతుంది. నానుమ్ రౌడీనే సీన్స్ తన డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు నయనతార పై 10 కోట్ల పరువు నష్టం దావా వేసి షాకిచ్చిన ధనుష్ పై నయనతార సివంగిలా సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడింది. ధనుష్ ఊరుకుంటాడా కోర్టుకు వెళ్ళాడు.
ఇక ధనుష్ ఫ్యాన్స్ vs నయనతార మధ్యలో విగ్నేష్ శివన్ అన్న రేంజ్ లో సోషల్ మీడియా వార్ జరుగుతుంది. విగ్నేష్ శివన్ గతంలో ధనుష్, అజిత్ లపై చేసిన కామెంట్స్ ని ఇప్పడు ట్రోల్ చేస్తూ విగ్నేష్ శివన్ కు చుక్కలు చూపిస్తున్నారు. దానితో విగ్నేష్ శివన్ సోషల్ మీడియా అందులోనూ ట్విట్ట్ర్ X నుంచి తప్పుకున్నాడు.
విగ్నేష్ శివన్ ధనుష్ ఫ్యాన్స్ టార్చర్ భరించలేకే సోషల్ మీడియా నుంచి జంప్ అయ్యి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.