పుష్ప ది రూల్‌లో అల్లు అర్జున్‌కి విలన్‌గా నటించిన ఫహద్ ఫాసిల్‌ని మొదట్లో హీరోగా చాలా మంది యాక్సెప్ట్ చెయ్యలేదు, బట్టతల ఉంది, మరీ సన్నగా ఉన్నాడు ఈయనేం హీరో రా, యాక్టింగ్ రానోడు.. తండ్రి డైరెక్టర్ అయితే హీరో అయిపోవచ్చా అంటూ కామెంట్స్ చేసినోళ్లు నోరు మూతబడేలా ఫాహద్ ఫాసిల్ కెరీర్ ఉంది.
పుష్ప 2 విడుదలవుతున్న సమయంలో ఆయన తన జర్నీపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పుష్ప 1 చిత్రంలో పార్టీ ఉందా అనే డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. పుష్ప 2 లో అల్లు అర్జున్‌కి సరిసమానమైన పాత్ర భన్వర్ సింగ్ షెకావత్‌ది. అయితే కమల్ హాసన్ సర్ నాపై ఉన్న ప్రేమతో విక్రమ్‌లో ఓ కేరెక్టర్ ఇచ్చారు, అలాగే రజిని సర్ వేట్టయ్యాన్‌లోనూ అంతే. వారి మీద గౌరవంతోనే ఆ సినిమాలు చేశాను.
అయితే నాయకుడు చిత్రంలో కేరెక్టర్ నచ్చి విలన్‌గా నటించాను, కానీ ఆ సినిమా చెయ్యకుండా ఉండాల్సింది అని చాలాసార్లు అనిపించింది. కారణం నాకు కుక్కలంటే చాలా ఇష్టం. కానీ నాయకుడు సినిమాలో నేనే కుక్కలని చంపేసే సీన్స్ నన్ను బాధపెట్టాయి అంటూ ఫాహద్ ఫాసిల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇక ఓటీటీ లో ఆవేశం, ట్రాన్స్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాను, ఇప్పడు పుష్ప2 తో మరింత దగ్గర కాబోతున్నాను అంటూ ఫహద్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.