హీరోయిన్ మీనాక్షి చౌదరికి కెరీర్‌లో లక్కీ భాస్కర్ సక్సెస్ ఎప్పటికీ పదిలంగా గుర్తుండిపోతుంది. అంతకు ముందు స్టార్ హీరోల సినిమాల్లో నటించినా మీనాక్షికి అనుకున్నంత గుర్తింపు దక్కలేదు, మహేష్, విజయ్ లాంటి స్టార్స్ కూడా మీనాక్షి చౌదరికి హిట్ ఇవ్వలేదు. కానీ దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ తో మీనాక్షిని 100 కోట్ల హీరోయిన్‌ని చేశాడు.
లక్కీ భాస్కర్‌లో సుమతి కేరెక్టర్‌లో మీనాక్షి చౌదరి నటనకు ఆడియన్స్ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. అయితే లక్కీ భాస్కర్‌లోని సుమతి లాంటి కేరెక్టర్ చేసి ఇంకోసారి తప్పు చెయ్యను అంటుంది మీనాక్షి. సుమతి కేరెక్టర్ చేశాక తన ఫ్రెండ్స్ తనని భయపెట్టారని, కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి భార్య, తల్లి పాత్రలు చేస్తే తర్వాత కూడా అలాంటి కేరెక్టర్సే వస్తాయని చెప్పారట.
లక్కీ భాస్కర్‌లో సుమతి కేరెక్టర్ కి ప్రసంశలు లభించినా దానిని ఎంజాయ్ చేయలేకపోయానని.. భార్య, తల్లి పాత్రలు చెయ్యడానికి ఇంకా సమయం ఉంది, ఇలాంటి కేరెక్టర్స్ ఒప్పుకుంటే తర్వాత తర్వాత అక్క, వదిన పాత్రలకు పరిమితం చేస్తారని తన స్నేహితులు చెప్పడంతో తాను భయపడినట్లుగా మీనాక్షి చౌదరి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.