Advertisement
Google Ads BL

బిగ్ బాస్ బజ్‌లో తేజకు దిమ్మతిరిగింది


బిగ్ బాస్ సీజన్8లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి ఫ్యామిలీ వీక్‌లో అమ్మను తీసుకురావాలంటూ పదే పదే చెప్పడమే కాకుండా టాస్క్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేక టాప్ 5కి వెళ్లకుండానే టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యి ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. అవినాష్, రోహిణీలతో కామెడీ చేస్తూ టాస్క్‌ల విషయంలో మాత్రం వీక్ అయిన తేజ ఫైనల్ గా 13వ వారంలో ఇంటిని వీడాల్సి వచ్చింది. 

Advertisement
CJ Advs

ఇక బయటికి రాగానే బిగ్ బాస్ బజ్‌లో టేస్టీ తేజకి అంబటి అర్జున్ ప్రశ్నలు సంధించగా టేస్టీ తేజకు దిమ్మతిరిగింది. తేజ హౌస్‌లో ఏమేం చేశాడో, ఎందుకు ఎలిమినేట్ అయ్యాడో, బయట అతనికున్న నెగిటివిటి ఏమిటో అర్జున్ చెప్పాడు. అయితే తేజ మాత్రం బిగ్ బాస్ హౌస్‌లో ఒకటి హీరోహిక్ కేటగిరి.. రెండవది కమెడియన్ కేటగిరి అందుకే నేను ఎలిమినేట్ అయ్యాను అన్నాడు. 

అది అపోహ మాత్రమే, వాళ్లు హీరోలు.. మీరు కమెడియన్లు అనేది చాలా తప్పు అని అర్జున్ అంటే.., కానీ ఇదే కరెక్ట్.. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా.. ఇదే నిజం అంటూ టేస్టీ తేజ ఒప్పుకోడు. హౌస్‌లో యష్మి, పృథ్వీ, నిఖిల్ గ్రూప్ గేమ్ అన్నారు.. నువ్వు, రోహిణి, అవినాష్ గ్రూప్ గేమ్ ఆడలేదా అని అడిగాడు అర్జున్, తప్పులను తెలుసుకొని ఆడాం తప్ప మేము గ్రూప్ గేమ్ ఆడలేదు అని సమాధానమిచ్చాడు. 

గుడ్డు గేమ్‌లో, దోశల విషయంలో అగ్గి రాజేసిన విషయం అన్ని నీ తప్పులే కదా అని అర్జున్ తేజని అడిగితే.. అది నా గేమ్, నా పాయింట్‌లో అది కరెక్ట్ అంటూ కవరింగ్ సమాధానాలు చెప్పుకొచ్చాడు.

Chit Chat Between Tasty Teja and Arjun:

Arjun Gives Shock to Tasty Teja
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs