మరో నాలుగు రోజుల్లో అక్కినేని ఫ్యామిలీలోకి కోడలిగా అడుగుపెట్టబోతుంది హీరోయిన్ శోభిత దూళిపాళ్ల. బ్రాహ్మణ కుటుంబం నుంచి నాగ చైతన్య కు భార్యగా రాబోతున్న శోభిత దూళిపాళ్ల విషయంలో నాగార్జున చాలా హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియో లో తండ్రి విగ్రహం సాక్షిగా పెద్ద కొడుకు నాగ చైతన్య-శోభితల వివాహాన్ని నాగార్జున జరిపించబోతున్నారు.
అయితే కొడుకు నాగ చైతన్యకు పెళ్ళికి గిఫ్ట్ గా నాగార్జున ఓ కాష్ట్లీ కారుని బహుమతిగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నాగార్జున 2.5 కోట్ల విలువ చేసే అధునాత లెక్సస్ LM MPV కారును బహుమతిగా ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇక కోడలిగా అడుగుపెట్టబోయే శోభితకు చాలా ఖరీదు గల బంగారు ఆభరణాలు బహుమతిగా ఇస్తున్నారట.
అయితే నాగ చైతన్య-శోభితల వెడ్డింగ్ రైట్స్ ను డాక్యుమెంటరిగా నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తుంది, దానికోసం అక్కినేని ఫ్యామిలీ కోట్లలో డీల్ కుదుర్చుకున్నారనే వార్తలను నాగచైతన్య పిఆర్ టీం ఖండించింది.