డిసెంబర్ 5 న విడుదల కాబోతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిలిం పుష్ప ద రూల్ సంబరాలు మొదలైపోయాయి. ఇప్పటివరకు పాన్ ఇండియా మార్కెట్ లో పుష్ప2 ను ప్రమోట్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు రెండు తెలుగు రాష్టాల్లో ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యబోతున్నారు. హైదరాబాద్ లో పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. అదలాఉంటే పుష్ప2 విడుదలకు ఒక రోజు ముందే తెలంగాణలో పుష్ప ప్రీమియర్ షోస్ కి తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది.
అంతేకాదు పుష్ప2 టికెట్ రేట్లు పెంచుతూ అనుమతి కూడా వచ్చేసింది. ప్రీమియర్ షో టికెట్ రేటు రూ.800 పెంచుతూ ఉత్తర్వులు.. జారీ అయ్యాయి. డిసెంబర్ 4 9:30 PM షోస్ కి టికెట్ రేట్లు
సింగిల్ స్క్రీన్స్ - రూ.1121
మల్టీప్లెక్స్ - రూ.1239
మొదటి నాలుగు రోజులు
సింగిల్ స్క్రీన్స్ - రూ. 354
మల్టీప్లెక్స్ - రూ. 531