Advertisement
Google Ads BL

నందమూరి అందగాడు మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్


నందమూరి మోక్షుజ్ఞ హీరో గా తెరంగేట్రానికి తెర వెనుక పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ప్రశాంత్ వర్మ PVCU లో భాగంగా మోక్షజ్ఞ తో భారీ బడ్జెట్ తో భారీగా రూపొందబోయే మూవీ కోసం మోక్షజ్ఞ మేకోవర్ నందమూరి అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ మూవీ ప్రీ ప్రొడక్షన్ లో తలమునకలై ఉన్నారు. 

Advertisement
CJ Advs

తాజాగా మోక్షగా కొత్త స్టిల్ బయటికి వచ్చింది. ప్రశాంత్ వర్మ తో మొదలు పెట్టబోయే మూవీ కోసం నటనలో శిక్షణ తీసుకోవడమే కాకుండా హ్యాండ్ సం లుక్ లోకి మారిపోయాడు. మోక్షజ్ఞ నటన, ఫైట్లు మరియు డ్యాన్స్‌లలో శిక్షణ పొందాడు. మంచి ఫిట్ నెస్ ని మైంటైన్ చేస్తూ కొత్త అవతార్ లో మోక్షజ్ఞ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. 

తాజాగా మోక్షజ్ఞ మోడరన్, స్టైలిష్ లుక్‌లో అద్దంలోకి చూస్తున్న కొత్త స్టిల్ వైరల్ అయ్యింది. గళ్ల చొక్కా ధరించి, పర్ఫెక్ట్ స్టైల్ చేసిన జుట్టు మరియు గడ్డంతో అభిమానులను తెగ ఇంప్రెస్స్ చేసేసాడు. త్వరలోనే మోక్షజ్ఞ కొత్త చిత్రం ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అతి త్వరలోనే మోక్షు షూటింగ్ లోకి ఎంటర్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. 

Nandamuri Mokshagnya Aesthetic Makeover:

What A Makeover For Nandamuri Mokshagnya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs