Advertisement
Google Ads BL

రిలేషన్ లో అన్నీ భరించాను - అనన్య పాండే


బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే ఈమధ్యన ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. బాడీ షేమింగ్ పై సన్సేషనల్ కామెంట్స్ చేసిన అనన్య పాండే తాజాగా రిలేషన్ షిప్, అలాగే బ్రేకప్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అనన్య పాండే గతంలో ఆదిత్య రాయ్ కపూర్ తో డేటింగ్ చేసింది, ఈ మధ్యన బ్రేకప్ అయ్యింది అనే రూమర్స్ నడిచాయి. 

Advertisement
CJ Advs

అందులో భాగంగానే ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో అనన్య రిలేషన్స్ పై కామెంట్స్ చేసింది. ఎదుటి వ్యక్తి కోసం తానేంతో మారాను అని, ఆ వ్యక్తి కోసం చాలా విషయాల్లో రాజీపడ్డానని చెప్పుకొచ్చారు. రిలేషన్ లో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి మెప్పు పొందడం, వారి దృష్టిని ఆకర్షించడం కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది, తాము మారుతున్నామనే విషయం మొదట్లో అస్సలు తెలుసుకోలేము. 

మనం ఇష్టపడే వారి కోసం ఎంత మారినా ఫర్వాలేదనిపిస్తుంది, ఇది సహజంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు లోపాలు తెలియవు, అన్ని బాగానే అనిపిస్తాయి. ఏదీ మనకు సమస్యగా అనిపించదు. ఆ బంధం నుంచి బయటకు వచ్చినప్పుడే అన్నీ అర్థమవుతాయని, కానీ తాను మాత్రం రిలేషన్‌షిప్‌లో నిజాయతీగా ఉంటానని తెలిపింది. 

అంతేకాదు ఎదుటి వ్యక్తి నుంచి కూడా అంతే నిజాయతీ లభిస్తే బాగుంటుందని చెప్పిన అనన్య పాండే తనకు కాబోయే వ్యక్తి అన్నివిధాలా అర్థం చేసుకునేవాడు అయి ఉండాలని చెప్పుకొచ్చింది. 

I bear everything in a relationship - Ananya Pandey:

Ananya Panday reveals she compromised a lot in past life
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs