వైసీపీ పార్టీకి, ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై మీచమైన పోస్ట్ లు పెట్టిన వారంతా ఇప్పుడు జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. అందులో భాగంగానే వైసీపీ పార్టీ కోసం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు, లోకేష్, పవన్ లపై వ్యూహం లాంటి సినిమాలు తియ్యడమే కాదు, వారిపై ఇష్టమొచ్చినట్లుగా ట్వీట్లుపెట్టారు. దానికి ప్రతిఫలం ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు.
కానీ ఆయన విచారణకు రాకూండా తప్పించుకుని బెయిల్ వచ్చేవరకు పోలీసులకు దొరక్కుండా డ్రామా ప్లే చేస్తున్నారు. మరికాసేపట్లో RGV అరెస్ట్ అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో ఒకటే వార్తలు. రామ్ గోపాల్ వర్మ కోసం రెండుమూడు పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి అంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో.. తాజాగా వర్మ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.
RGV అనే పదం అంటే భయం.. RGV కి భయం కాదు, ఇప్పటివరకు ప్రకాశం జిల్లా పోలీసులు తనను అరెస్టు చేయడానికి వచ్చామని ఎక్కడా చెప్పలేదని, మీడియానే RGV అరెస్టు, పరారీ అంటూ ప్రచారం చేస్తుంది, తాను అరెస్ట్ అయ్యాను, ఏదో జరిగిపోయిందని కొందరు ఫోన్లు చేసి సానుభూతి తెలుపుతుంటే అది వినలేక చిరాకొచ్చి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాను అని చెప్పిన RGV..
చంద్రబాబు, లోకేశ్ ప్రతీకార రాజకీయాలు చేస్తారని అనుకోవడం లేదు, ఎందుకంటే వాళ్లకున్న బిజీ షెడ్యూల్స్ వలన నన్ను వాళ్లు పట్టించుకుంటారని అస్సలు అనుకోవడం లేదు, వారు 164 సీట్లతో రికార్డు స్థాయిలో గెలవడమే అసలైన ప్రతీకారం, నేను ఎన్ని సినిమాలు చేసి, ఎన్ని పోస్ట్ లు పెట్టినా వాళ్ల గెలుపు ఆగలేదు, నా సినిమాలు, నా పోస్టులు.. ఒక్క ఓటును కూడా ప్రభావితం చేయలేకపోయాయి అంటూ RGV ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.