Advertisement
Google Ads BL

బిగ్ బాస్ - ఫస్ట్ ఆమెను ఎలిమినేట్ చేయండి


విష్ణు ప్రియను ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్ అప్పుడే పృథ్వీ గేమ్ అలాగే కొంతమంది గేమ్ బాగా ఆడతారు అంటూ బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే బ్యాచ్ మొత్తం ముక్త ఖంఠంతో డిమాండ్ చేస్తుంది. విష్ణు ప్రియకి బిగ్ బాస్ కి వెళ్లేముందు బ్రేకప్ అవడంతో హౌస్ లోకి వెళ్ళాక నిఖిల్, పృథ్వీల తోడు కోసం ప్లాన్ చేసి పృథ్వీని ఫ్రెండ్ గా చేసుకుని క్లోజ్‌గా మూవ్ అయ్యింది. 

Advertisement
CJ Advs

అది బిగ్ బాస్‌కి ఎంటర్ అయ్యాక నాలుగు వారాల తర్వాత జరిగింది. అప్పుడు టాస్క్‌లు బాగానే ఆడే విష్ణు ప్రియ.. పృథ్వీతో తిరగడం మొదలుపెట్టాక ఆమె ఆట మొత్తం స్మాష్ అయ్యింది. అదే విషయం అఖిల్-హారికలు బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన రోజే చెప్పారు. 

ఇక ఇప్పుడు ఆమెకి బిగ్ బాస్ టాప్ 5 లోకి వెళ్లేందుకు టికెట్ టు ఫినాలే రేస్ లో విష్ణు ప్రియకు ముందుగా బ్లాక్ బ్యాడ్జ్ వచ్చింది. అంటే ఆమె ఇకపై టాస్క్ ల్లో పోటీ చెయ్యకుండా ఆ బ్యాడ్జ్‌ని అఖిల్ అండ్ హారిక ఇచ్చారు. దానితో ఆమె చాలా ఎమోషనల్ అవ్వగా.. బయట రివ్యూస్ చెప్పే వాళ్ళు ముందుగా విష్ణు ప్రియకు ఓట్లెయ్యడం ఆపెయ్యండి, ఆమె ఫ్యాన్స్ ఆమెని ఎలిమినేట్ చేసేస్తే హ్యాపీగా ఉంటుంది. ఆమె లేకపోతే పృథ్వీ వాళ్ళు టాస్క్‌లు ఆడి గెలుస్తారు, ముందు పృథ్వీని కాదు, విష్ణు ప్రియను ఎలిమినేట్ చేయమంటూ మొత్తుకుంటున్నారు. మరి ఈ వారం ఏమైనా ఆ అవకాశం ఉంటుందేమో చూద్దాం.   

Bigg Boss Reviewers Wants Eliminate Vishnu Priya:

Bigg Boss First Eliminat Vishnu Priya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs