Advertisement
Google Ads BL

డౌట్ లేదు-రాజమౌళి తర్వాత అల్లు అర్జునే


రాజమౌళి పాన్ ఇండియాకి గురి పెట్టారు అంటే అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యేలా ఆయన ప్లానింగ్ వేరే లెవల్ అనిపించేది. ఇప్పటివరకు రాజమౌళిని తలదన్నేలా ఏ దర్శకనిర్మాత కానీ ఏ హీరో కానీ ప్లాన్ చేయలేకపోయారు. ఈవెన్ ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా ఎవ్వరూ రాజమౌళిలా తమ సినిమాలను ప్రమోట్ చేయలేకపోయారు. 

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు రాజమౌళిలా అల్లు అర్జున్ చేస్తున్నాడు. పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉందా, లేదా అనేది పక్కనపెడితే ఆయన పుష్ప 2 ద రూల్ ని ప్రమోషన్స్ చేస్తున్న హడావిడి చూస్తే పుష్ప 2 కి భారీ ఓపెనింగ్స్ పక్కా అనిపిస్తుంది. గతంలో రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ లను వెంటేసుకుని పలు సిటీస్ లో ఆర్.ఆర్.ఆర్ ని ప్రమోట్ చేసారు. అది బాగా వర్కౌట్ అయ్యింది. 

ఇప్పుడు అల్లు అర్జున్ తన సైన్యం సుకుమార్, దేవిశ్రీ, ఇంకా ముఖ్య నటులు లేకుండా రష్మిక తో కలిసి సుడిగాలిలా పుష్ప2 భారీ ఈవెంట్స్ తో పాట్నా మొదలు కొచ్చి వరకు తన క్రేజ్ చూపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్లినా అల్లు అర్జున్ కి అభిమానులు బ్రహ్మరధం పడుతున్నారు. పాట్నా ట్రైలర్ లాంచ్ ఈవెంట్, చెన్నై ఈవెంట్, ఈరోజు కొచ్చి ఇలా ప్రతి పుష్ప ఈవెంట్ లో అల్లు అర్జున్ సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతున్నాడు. 

అది చూసాక పాన్ ఇండియా మార్కెట్ ని ఎలా క్యాష్ చేసుకోవాలో అనేది రాజమౌళి తర్వాత అల్లు అర్జున్ బాగా క్యాచ్ చేసాడు అంటూ అందరూ మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. సుకుమార్ చెబుతారు, నిర్మాతలు ప్లాన్ చేస్తారు మనం మొక్కుబడిగా వెళ్లి సినిమాని ప్రమోట్ చేద్దామని కాకుండా అన్ని తానై అల్లు అర్జున్ వ్యవహరిస్తున్న తీరుకు ఆయన అభిమానులే కాదు మూవీ లవర్స్ మొత్తం ఫిదా అవుతున్నారు. 

No Doubt-Allu Arjun after Rajamouli:

Allu Arjun Craze at Kochi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs