Advertisement
Google Ads BL

డిసెంబర్‌లో చైతు-మార్చిలో అఖిల్


నాగ చైతన్య పెళ్లిపనుల్లో అక్కినేని ఫ్యామిలీ తలమునకలై ఉంటుంది అని అందరూ అనుకుంటున్న తరుణంలో.. నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ నిశ్సితార్ధాన్ని చేసి షాకిచ్చారు. గతంలోని అఖిల్ నిశ్చితార్ధం జరగగానే నాగ చైతన్య-సమంత ల పెళ్లి జరిగింది. అప్పుడా ఎంగేజ్మెంట్, ఆ పెళ్లి రెండు బ్రేక్ అయ్యాయి. 

Advertisement
CJ Advs

ఇప్పుడు కూడా అఖిల్ నిశ్సితార్ధం అవ్వగానే నాగ చైతన్య శోభిత మెడలో మూడు ముళ్ళు వెయ్యబోతున్నాడు. అయితే నిన్న మంగళవారం అఖిల్ నిశ్సితార్ధం జరిగినట్టుగా సింపుల్ గా ప్రకటించారు. పెళ్లి మాత్రం వచ్చే ఏడాది మార్చి లో ఉంటుంది అని తెలుస్తోంది. నాగ చైతన్య పెళ్లి డిసెంబర్ 4 న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతోంది. చైతు-శోభితల పెళ్లి హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. 

ఇక డిసెంబర్ లో పెద్ద కొడుకు చైతూ పెళ్లి చేసే నాగార్జున వచ్చే ఏడాది మార్చి లో చిన్న కొడుకు అఖిల్ వివాహం చేయనున్నట్లుగా తెలుస్తోంది. అఖిల్ -  జైనాబ్ రావ్‌జీ పెళ్లిని దుబాయ్ వేదికగా ఇరు ఫ్యామిలీస్ జరిపించనున్నట్లుగా తెలుస్తుంది. 

Naga Chaitanya in December-Akhil in March:

Akhil Akkineni gets engaged to Zainab Ravdjee
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs