Advertisement
Google Ads BL

రిషబ్ శెట్టి మరో తెలుగు సినిమాకి శ్రీకారం


కన్నడ సంచలన డైరెక్టర్ కమ్ నటుడు రిషబ్ శెట్టి తెలుగు లోకి దూసుకొస్తున్నారు. కాంతార చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసిన రిషబ్ శెట్టి.. దానికి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు రిషబ్ శెట్టి టాలీవుడ్ పై కన్నేశారు. ఇప్పటికే హనుమాన్ దర్శకుడితో జై హనుమాన్ పాన్ ఇండియా మూవీతో టాలీవుడ్ కి ఎంటర్ అయ్యారు. 

Advertisement
CJ Advs

జై హనుమాన్ మూవీలో హనుమాన్ గా రిషబ్ శెట్టి లుక్ పాన్ ఇండియా ప్రేక్షకులను బాగా ఇంప్రెస్స్ చేసింది. ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ ని పూర్తి చేసేసి ఆ తర్వాత జై హనుమాన్ సెట్స్ లోకి వస్తారని తెలుస్తోంది. ఇప్పడు రిషబ్ శెట్టి చెయ్యబోయే మరో తెలుగు సినిమా వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

సితార ఎంటర్టైన్మెంట్ లో రిషబ్ శెట్టి అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఓ మూవీకి కమిట్ అయ్యారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. కానీ అఫీషియల్ వార్త లేదు, అది ఈ వారంలోనే రిషబ్ శెట్టి-సితార బ్యానర్ మూవీపై అధికారిక ప్రకటన రావొచ్చని తెలుస్తోంది. 

Rishab Shetty has fixed the moment for another Telugu film:

Rishab Shetty new project details 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs