Advertisement
Google Ads BL

ఎంగేజ్మెంట్ చేసుకుని షాకిచ్చిన అఖిల్


అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గతంలో అఖిల్ ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుని సింగిల్ గా పేరెంట్స్ దగ్గరే ఉంటున్నాడు. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలి నాగ చైతన్య పెళ్లి మూడ్ లో ఉన్న సమయంలో షాకింగ్ గా అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని నాగార్జున అనౌన్స్ చేసారు. 

Advertisement
CJ Advs

ఎలాంటి  హడావిడి లేకుండా అఖిల్ అక్కినేని, జుల్ఫీ రావ్‌జీ కుమార్తె జైనాబ్ రావ్‌జీతో నిశ్చితార్ధం చేసుకున్నాడు. అఖిల్ కు, జైనాబ్ కు రెండేళ్ల కిందట పరిచయం అయ్యింది, ఆ పరిచయం ప్రేమగా మారడంతో అక్కినేని ఫ్యామిలీ, జైనాబ్ ఫ్యామిలీ వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇరు కుటుంబాల పెద్దలు వీరికి నాగార్జున ఇంట్లోనే సింపుల్ గా ఇరు కుటుంబాల నడుమ నిశ్చితార్ధం చేసారు. 

అఖిల్-జైనాబ్ నిశ్చితార్ధాన్ని అనౌన్స్ చేస్తూ.. అఖిల్ కూడా పెళ్లిపీటలు ఎక్కుతుండడంపై సంతోషం వ్యక్తం చేశారు నాగార్జున. జైనాబ్ తమ కుటుంబంలో వెలుగులు నింపబోతున్నది, అఖిల్-జైనాబ్ వివాహం కోసం ఇరు కుటుంబాలు అత్యంత ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాయని నాగ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. 

Nagarjuna Announces the Engagement of Akhil Akkineni :

Akkineni Family Announces the Engagement of Akhil Akkineni and Zainab Ravdjee
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs