Advertisement
Google Ads BL

సుమ అడ్డాలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గొడవ


బిగ్ బాస్ లోకి వెళ్లొచ్చిన కంటెస్టెంట్స్ తమ తమ అగ్రిమెంట్స్ పూర్తి కావడంతో వేరే ఛానల్ షోస్ కి కూడా వెళుతున్నారు. అలా గత సీజన్స్ కంటెస్టెంట్స్ అయిన గీతు రాయల్, ఫైమా, కీర్తి భట్,  రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, దామిని, భోలే వీళ్లంతా సుమ అడ్డాలో ఈ వారం సందడి చెయ్యడానికి రెడీ అయ్యారు. అయితే బిగ్ బాస్ లో నామినేషన్స్ అప్పుడు, టాస్క్ ల్లో ఎలా కొట్టుకుంటారో సుమ అడ్డాలో అచ్చం అలానే గొడవ పడ్డారు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్. 

Advertisement
CJ Advs

ఫైమా ఫస్ట్ రౌండ్ కి తనని పిలవలేదు అంటూ గీతూని నువ్వ్వేమన్నా తోపువా అని అడగగానే గీతూకి కోపమొచ్చింది. నువ్వు కామెడీ చేస్తావా అంటే నువ్వు కామెడీ చేస్తావా అని తిట్టుకున్నారు.. మధ్యలో భోలే ఒక టీమ్ లో ఉన్నవారు ఎలా గొడవపడతారని అడగ్గానే ఇది నీ టీమ్ కాదు నువ్వు మాట్లాడడానికి అంటూ భోలే పై గీతూ రైజ్ అయ్యింది. దానితో సుమ వామ్మో ఎన్ని ఈగోలు రా బాబోయ్.. బిగ్ బాస్ లో వదిలేసిన గొడవలు ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నారని అంది. 

షో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అంది గీతూ. నువ్వు అన్నప్పుడు నాకు కూడా కోపమొచ్చింది మన అక్కే కదా అని ఊరుకున్నాను అన్నాడు పల్లవి ప్రశాంత్, దానికి గీతు అక్కడ చేసిన కథలన్నీ ఇక్కడ చెయ్యకు అని పల్లవి ప్రశాంత్ పై ఫైర్ అయ్యింది. ఇలాంటివన్నీ తీసుకోలేకపోతే ఇంకోసారి షోస్ కి రకు అంది గీతూ. 

ఇది నాబ్రతుకు తెరువు నేను రైతు బిడ్డని అన్నాడు పల్లవి ప్రశాంత్. మా నాయన కలెక్టర్ అని నేను కలెక్టర్ కాదు కదా అని గీతూ అనగానే సుమ ఓ మీరు రియాలిటీ షోకి వెళ్ళినప్పుడు అక్కడ మిగిలినవన్నీ ఇక్కడ చూపించేస్తున్నారు అంటూ చెప్పిన ప్రోమో వైరల్ అయ్యింది. 

Bigg Boss contestants clash in Suma Adda:

Suma Adda today promo goes viral  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs