Advertisement
Google Ads BL

అంతా అల్లు అర్జునే చేసాడు


దేవిశ్రీ ప్రసాద్ కి సుకుమార్ కి విడదీయలేని అనుబంధం ఉంది. సుకుమార్ తన మొదటి సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ తోనే ట్రావెల్ చేస్తున్నారు. వారి కాంబోలో వచ్చిన మ్యూజిక్ ఆల్బమ్స్ ఆల్మోస్ట్ అన్ని హిట్టే. అట్లాంటి కాంబో పుష్ప2 తో విడిపోయింది. పుష్ప ద రూల్ నేపధ్య సంగీతానికి దేవీశ్రీని పక్కనపెట్టి ఆ స్థానంలోకి మరోముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని తీసుకోవడం సెన్సేషన్ అయ్యింది. 

Advertisement
CJ Advs

అయితే ఇదంతా జరగడానికి అంటే దేవిశ్రీ-సుకుమార్ మధ్యన గ్యాప్ రావడానికి కారణం ఎవరో తెలుసా అల్లు అర్జున్. ఇది మేమంటున్నది కాదు, సోషల్ మీడియాలో కనిపిస్తున్న కామెంట్స్. సుకుమార్ పుష్ప 2 ద రూల్ షూటింగ్ హడావుడిగా ముగించడమెందుకు, ఇంకా BGM కూడా కంప్లీట్ అవ్వలేదు అందుకే సినిమాని వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేద్దామని చూశారట. 

కానీ అల్లు అర్జున్ ససేమిరా అన్నారట. ఇప్పటికే ఆగస్టు నుంచి డిసెంబెర్ కి వెళ్ళింది, మూడేళ్ళుగా ఈ ప్రాజెక్ట్ మీదే ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో పుష్ప 2 డిసెంబర్ 5 కే రావాలని అల్లు అర్జున్ పట్టుబట్టడంతో.. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఎలా పూర్తి చేసినా BGM వచ్చేసరికి దేవిశ్రీ కూడా లేట్ చెయ్యడంతో.. ఇక తప్పని పరిస్థితుల్లో దేవి ప్లేస్ లోకి థమన్ ని అలాగే మరో ఇద్దరిని సుకుమార్ తీసుకురావాల్సి వచ్చిందట. 

అల్లు అర్జున్ తొందర కారణంగా సుక్కు అండ్ నిర్మాతలు ఈ డెసిషన్ తీసుకోగా.. సుకుమార్ బడ్డీ కాబట్టి ఆయన్ని ఏమి అనలేక లైక్ అల్లు అర్జున్ ని కూడా ఏమనలేక దేవిశ్రీ ప్రసాద్ పుష్ప నిర్మాతలపై ఉన్న తన అక్కసుని వెళ్లగక్కాడంటూ గుసగుసలాడుకుంటున్నారు. 

Everything was done by Allu Arjun:

Is Allu Arjun the reason for the gap between Sukumar and Devishree
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs