నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల డిసెంబర్ 4 రాత్రి 8 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్ లో సింపుల్ గా పెళ్ళికి సిద్దమవుతున్నారు. కేవలం 300 మంది ఓరు కుటుంబాలు, స్నేహితులు, సన్నిహితులు, రిలేటివ్స్ నడుమ నాగ చైతన్య-శోభిత ల వివాహం జరగబోతుంది. అయితే చైతు-శోభితల పెళ్ళికి సంబందించిన ఓ న్యూస్ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కొంతకాలంగా సినీ సెలబ్రెటీలు వారి పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ ని ఓటీటీలకు అమ్ముకొని కోట్లు కొల్లగొడుతూ ఓ ట్రెండ్ సెట్ చేసారు. ఇప్పటికే చాలామంది సీని సెలబ్రిటీలు తమ పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ ను అమ్ముకొని వందల కోట్లు సంపాదించారు. అలా దీపికా, కత్రినా కైఫ్, హన్సిక, నయనతార ఇలా చాలామంది సెలబ్రిటీస్ తమ పెళ్లి హక్కులను అమ్ముకుని క్యాష్ చేసుకున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ ని చైతు-శోభితాలు ఫాలో అవుతున్నారంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది.
చైతు-శోభితాలు తమ వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకు విక్రయించారని.. ఈ పెళ్లి హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ దాదాపు 50 కోట్ల బడ్జెట్ ను వెచ్చించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈవార్తలపై అటు అక్కినేని ఫ్యామిలీ కానీ ఇటు దూళిపాళ్ల ఫ్యామిలీ కానీ స్పందించలేదు.