మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన లక్కీ భాస్కర్ అక్టోబర్ 31 దీపావళి సందర్భంగా విడుదలై సెన్సేషనల్ హిట్ అవడమే కాదు 100 కోట్ల క్లబ్బులో హుందాగా అడుగుపెట్టింది. సుమతిగా భాస్కర్ కి భార్యగా మీనాక్షి చౌదరి దుల్కర్ సల్మాన్ తో పోటీపడి నటించింది.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ అయిన ఈ చిత్రం థియేటర్స్ లో అతి పెద్ద హిట్ అవడంతో లక్కీ భాస్కర్ ఓటీటీ స్ట్రీమింగ్ పై అందరిలో విపరీతమైన ఆసక్తి మొదలయ్యింది. మరి లక్కీ భాస్కర్ ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.
తాజాగా లక్కీ భాస్కర్ ఓటీటీ డేట్ లాక్ చేసేసారు మేకర్స్. ఈ నెల 30 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా లక్కీ భాస్కర్ ని స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్లుగా ప్రకటించారు. మరి థియేటర్స్ లో మిస్ అయిన ఈ హిట్ చిత్రాన్ని ఓటీటీలో వీక్షించేందుకు మరో వారం వెయిట్ చేస్తే సరిపోతుంది.