Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ కోసం అమీర్ ని దించనున్న నీల్


కేజిఫ్ ని పాన్ ఇండియా హిట్ గా మలచిన కన్నడ సంచలనం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ తర్వాత సలార్ తో కేక పెట్టించారు. సలార్ చిత్రంలో ప్రభాస్ కి పోటీగా పృథ్వీ రాజ్ సుకుమారన్ ని దించి ఈ ప్రాజెక్ట్ పై విపరీతమైన హైప్ పెంచారు. సలార్ పై క్రేజ్ పెంచారు. పార్ట్ 1 లో పృథ్వీ రాజ్ సుకుమారన్ - ప్రభాస్ లను దోస్త్ లుగా చూపించి పార్ట్ 2 లో అసలు సిసలు యాక్షన్ చూపించబోతున్నారు. 

Advertisement
CJ Advs

ఇప్పుడు ఎన్టీఆర్ తో చెయ్యబోయే ప్రాజెక్ట్ లోకి ఏకంగా బాలీవుడ్ స్టార్ ని ఎన్టీఆర్ కోసం విలన్ గా తీసుకొస్తున్నారనే న్యూస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఎన్టీఆర్ తో పోటీపడాలంటే బాలీవుడ్ నుంచి స్టార్ హీరో దిగాల్సిందే అని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యారట. ఎన్టీఆర్ తో సరిసమానమైన నెగిటివ్ పాత్రకు బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ పర్ ఫెక్షనిస్టు అమీర్ ఖాన్ సరిపోతాడని భావిస్తున్నారట ప్రశాంత్ నీల్. 

మరి ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ని దించడం అంటే ఆ ప్రాజెక్ట్ ఏ రేంజ్ లో తెరకెక్కుతుందో అర్ధమవుతుంది. ఇక హీరోయిన్ గా కూడా ప్రశాంత్ నీల్ బాలీవుడ్ భామని దించాలని ట్రై చేస్తున్నారని, కాదు హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. చూద్దాం ఫైనల్ గా ఏ వార్తలు నిజమవుతాయో అనేది. 

Aamir Khan to share the frame with NTR :

Aamir Khan to star alongside Jr NTR in NTR 31
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs