ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవర్ ఏపీ నుంచి మహారాష్ట్రకు పాకింది. ఏపీలో టీడీపీ - బీజేపీ లతో జతకట్టిన పవన్ కళ్యాణ్ తాను నిలబెట్టిన 21 సీట్లను జనసేన పార్టీతో గెలిపించుకున్నారు. ప్రతిపక్షం కూడా 11 సీట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో పవన్ పవర్ మాములుగా కనిపించలేదు. ఆ గెలుపుతో ఆయన డిప్యూటీ సీఎం, పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖలను చేపట్టారు.
పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటు దాటనివ్వమని ఛాలెంజ్ చేసిన వైసీపీ నేతలు ప్రతిఒక్కరు రోజా, అంబటి, కొడాలి నాని వంటి వాళ్ళు ఓడిపోయి ఇంటికి పరిమితమైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ హోదాలో కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారారు. వైసీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ని అందరికన్నా ఎక్కువ టార్గెట్ చేసిన రోజా ఇప్పటికీ పవన్ పవర్ ని,ఆయన గెలుపుని ఒప్పుకోవడం లేదు.
తాజాగా పవన్ కళ్యాణ్ గెలుపుపై రోజా చేసిన కామెంట్స్ జనసైనికులకు కోపాన్ని తెప్పించాయి. 11 సీట్లు గెలిచిన జగన్ గారిని కామెంట్ చేసే ముందు, గతంలో రెండు సార్లు ఓడిపోయిన పవన్ రాజకీయ సన్యాసం తీసుకోవాలి, టీడీపీ,బీజేపీ బలంతోనే ఆయన గెలిచారు కానీ.. పవన్ కి అంత స్టామినా లేదు అంటూ ఓ ఇంటర్వ్యూ లో రోజా చేసిన కామెంట్స్ పై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒంటరిగా నిలబడి పవన్ గెలవాలని, తాను నగరిలో నిలబడి గెలిచి చూపిస్తాను అంటూ చాలేంజ్ చెయ్యడం చూసి పవన్ ఫ్యాన్స్ 2024 ఎన్నికల్లో ఓడిపోయినా రోజాకు బుద్ధి రాలేదు, నీ గర్వాన్ని నగరి ప్రజలు దించేశారు అయినా నీకు మాత్రం బుద్ది రాలేదు అంటూ రోజాను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.