Advertisement
Google Ads BL

టాప్ హీరోయిన్ కి ఇంత అవమానమా


ఎవరైనాసెలబ్రిటీస్ కనిపిస్తే వారిని కలిసి ఫోటో దిగడమో, లేదంటే మాట్లాడమో చేస్తుంటారు జనాలు, అదే అభిమానులైతే ఎగబడి సెల్ఫీ లు తీసుకుంటారు. అందుకే చాలామంది సెలబ్రిటీస్ పబ్లిక్ లో ఫ్రీ గా తిరగలేక వెకేషన్స్ అంటూ ఫ్యామిలీస్ తో కలిసి విదేశాలకు వెళ్ళిపోతారు. తమను ఎవరు గుర్తుపట్టని ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తారు.

Advertisement
CJ Advs

అయితే ఇండియాలోని చాలా ప్రదేశాల్లో నార్త్ నుంచి సౌత్ వరకు సెలబ్రిటీస్ కు అభిమానులు ఉన్నారు. అందులో పాన్ ఇండియా మూవీస్, అలాగే ఓటీటీలు వచ్చాక అది మరింతగా ఎక్కువైంది. అయితే ఇప్పుడొక టాప్ హీరోయిన్ కి ఢిల్లీలో అవమానము జరిగింది. అవమానం అనాలో లేదంటే ఇంకేదైనా పదం ఉపయోగించవచ్చో కాని.. అభిమానులు దానిని అవమానంగానే భావిస్తున్నారు. 

నయనతార తన బర్త్ డే ని ఈసారి సింపుల్ గా సెలెబ్రేట్ చేసుకుంది. అందుకోసం భర్త విగ్నేష్ శివన్ తో కలిసి ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఓ హోటల్ దగ్గర ఈ దంపతులు దాదాపు 30 మినిట్స్ లైన్ లో నిలబడి టేబుల్ దక్కించుకుని డిన్నర్ చెయ్యగా.. అక్కడ నయనతారను ఎవరూ గుర్తు పట్టలేదు. 

నయనతారను అక్కడ ఎవరూ గుర్తుపట్టి దగ్గరకు రాకపోవడం మాత్రం నిజంగా ఆమె ఫ్యాన్స్‌ని షాకింగ్‌కి గురిచేసింది. కానీ విగ్నేష్ శివన్ మాత్రం తన భార్యతో ఇలా సింపుల్ డిన్నర్ చేసి చాలా రోజులు అయ్యిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Nayanthara-Vignesh go unnoticed at Delhi restaurant:

Nayanthara goes unrecognised at Delhi Kake Da Hotel
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs