Advertisement
Google Ads BL

నా బిడ్డల మీద ఒట్టు ప్రభాస్ ఎవరో తెలియదు


నా బిడ్డల మీద ఒట్టు.. హీరో ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. ఆనాడు బిడ్డల మీద ఒట్టేసి చెప్పా.. ఇప్పుడు కూడా మళ్ళీ ఒట్టేసే చెబుతున్నాను. నాకు ఆయన ఎవరో తెలియదు. నేను ప్రభాస్‌ను ఇంతవరకు చూడలేదు. ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి స్పష్టం చేశారు. ఇవన్నీ తెలిసి కూడా తనకు వ్యక్తిత్వం లేనట్టు, ప్రభాస్ అనే హీరోతో సంబంధం ఉన్నట్లు వైఎస్ జగన్ గత ఐదేళ్లు ప్రచారం చేపించారనీ ఆరోపించారు. 

Advertisement
CJ Advs

దుమ్ము దులిపేసిన చెల్లి!

వైసీపీ - టీడీపీ కూటమి ప్రభుత్వం మధ్య సోషల్ మీడియా అరెస్టుల విషయంలో నడుస్తున్నది. ఈ తరుణంలో కౌంటర్ ఎటాక్ చేస్తూ మొత్తం టీడీపీనే చేసిందని, నాడు బాలకృష్ణ బిల్డింగ్స్ నుంచి తన సోదరి షర్మిలపై తప్పుడు ప్రచారం చేశారని, ఇదే విషయంపై షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం, ఇంటర్వ్యూలో షర్మిల మాట్లాడిన మాటలను వైఎస్ జగన్ మీడియా సమావేశంలో ప్రసారం చేసి చూపించారు. దీనిపై షర్మిల స్పందిస్తూ అన్నపై దుమ్మెత్తి పోశారు. సైతాన్ సైన్యంతో సోషల్ మీడియాలో ఆరోపణలు, విమర్శలు చేయించింది నిజం కాదా? అంటూ నిలదీశారు.

అంత ప్రేమ ఉందా..?

తమరికి నిజంగానే చెల్లెలిపై అంత ప్రేమ ఉందా? మీకు అసలు సిగ్గు ఉందా? అని జగన్ రెడ్డిని షర్మిల ప్రశ్నించారు. అంతే కాదు ఇదంతా మైలేజీ కోసమే జగన్ చేశారని, వీడియో ప్లే చేసి, తద్వారా సింపతీ సంపాదించుకునేందుకే ఇదంతా చేశారని మండిపడ్డారు. పేరు వస్తుందనుకుంటే తల్లి, తండ్రి, చెల్లి ఎవరినైనా వాడుకోవడానికి జగన్ వెనుకాడరు అని తిట్టిపొశారు. కన్న తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు సీబీఐ చార్జిషీట్ లో పెట్టించిన ఘనత అన్నదే అని.. ఆయనకు ఆయనే సాటి అని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నుంచి, ముఖ్యంగా జగన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి.

 

 

Who is Prabhas Sharmila asks Jagan:

Jagan Linked Sharmila With Prabhas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs