Advertisement
Google Ads BL

గేమ్ ఛేంజర్ పై విలన్ సూర్య పెంచుతున్న హైప్


జనవరి 10 సంక్రాంతి స్పెషల్ గా విడుదలకు సిద్దమవుతున్న గేమ్ ఛేంజర్ విడుదలకు ఇంకా 50 రోజులే సమయం ఉంది. అదే విషయాన్ని మేకర్స్ పోస్టర్ వేసి మరీ ప్రకటించారు. గేమ్ చెంజర్ టీజర్ తో పాన్ ఇండియా ప్రేక్షకుల మద్దతు మూటగట్టిన మేకర్స్ ఈ చిత్రం విడుదల సమయానికి అంచనాలు పెంచేలా ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు. అతి త్వరలోనే గేమ్ ఛేంజర్ నుంచి మూడో పాట రాబోతున్నట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అప్ డేట్ ఇచ్చాడు. 

Advertisement
CJ Advs

తాజాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ కి విలన్ గా పవర్ ఫుల్ రోల్ లో కనిపించిన ఎస్ జె సూర్య తన పార్ట్ డబ్బింగ్ పూర్తి చెయ్యడమే కాదు, గేమ్ ఛేంజర్ పై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యేలా వేసిన ట్వీట్ వైరల్ అయ్యి కూర్చుంది. ఇప్పుడే గేమ్ ఛేంజర్ కి సంబంధించి రెండు సీన్స్ కి  డబ్బింగ్ పూర్తి చేశా. 

ఒక సీన్ రామ్ చ‌ర‌ణ్‌తో, మ‌రోటి శ్రీ‌కాంత్ తో. ఈ రెండు సీన్లు పూర్తి చేయ‌డానికి నాకు రెండు రోజులు ప‌ట్టింది. అవుట్ పుట్ మాత్రం దీనెమ్మ దిమ్మ తిరిగి బొమ్మ క‌నిపించింది అనే రేంజ్ లో ఉండబోతుంది. ఈ రెండు సీన్ల‌కూ పిచ్చి పిచ్చిగా ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ రావడం ఖాయం. 

అంతేకాదు సరిపోదా శనివారం చిత్రంలో డైలాగ్ చెబుతూ.. థియేట‌ర్లో పోతారు, మొత్తం పోతారు. ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన శంక‌ర్ గారికీ, దిల్ రాజు గారికీ థ్యాంక్స్‌ అంటూ సూర్య వేసిన ట్వీట్ కి మెగా ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. 

Villain SJ Suryah is building hype on the Game Changer:

SJ Suryah Finishes Dubbing For Two Crazy Scenes Of Game Changer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs