Advertisement
Google Ads BL

అల్లు అర్జున్-శ్రీలీల డాన్స్ నెంబర్ రాబోతుంది


అల్లు అర్జున్‌-డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఇండియన్‌ బిగ్గెస్ట్‌ ఫిలిం పుష్ప-2 ది రూల్‌.. ఈ చిత్రం ఇప్పుడు ఇండియాలో హాట్‌టాపిక్‌..  ఇటీవల బీహార్‌లోని పాట్నాలో జరిగిన బిగ్గెస్ట్‌ ట్రైలర్‌ ఈవెంట్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. కనివిని ఎరుగుని జనసంద్రంతో.. ఉప్పొంగిన జనవాహిని సమక్షంలో.. దాదాపు మూడు లక్షల వరకు హాజరైన అభిమానుల సమక్షలంలో పుష్ప-2 దిరూల్‌ ట్రైలర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. 

Advertisement
CJ Advs

ఈ ఈవెంట్‌,బిగ్గెస్ట్‌ మాసివ్‌ ట్రైలర్‌ గురించి ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్నారు. ట్రైలర్‌ తరువాత సినిమాపై క్రేజ్‌.. అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ నట విశ్వరూపం డిసెంబరు 5న ప్రపంచమంతా చూడబోతుంది. దర్శకుడు సుకుమార్‌ టేకింగ్‌... కల్డ్‌ మాస్‌ మేకింగ్‌ గురించి మాట్లాడుకోబోతున్నారు. ఇక ఈ చిత్రంలో అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రత్యేక పాట అప్‌డేట్‌ వచ్చేసింది. 

 అల్లు అర్జున్‌, డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీలపై చిత్రీకరించిన ఈ పాటను ఈ నెల 24న చెన్నయ్‌లో జరగనున్న గ్రాండ్‌ ఈవెంట్‌లో ఈ కిస్సిక్‌ సాంగ్‌ను గ్రాండ్‌గా ఏడు గంటల రెండు నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నారు. ఒకవైపు ఐకాన్‌ స్టార్‌ డ్యాన్సుల గురించి, డ్యాన్సుల్లో ఆయన ఎనర్జీ, ఈజ్‌, స్టయిల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరో వైపు  డ్యాన్సుల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న కథానాయిక శ్రీలీల ఈకాంబోలో ప్రత్యేక గీతం అంటే ఇక ఫ్లోర్‌ ఫైరే... ఈ సాంగ్‌ పుష్ప-2లో మరో సన్సేషన్‌ సాంగ్‌గా నిలవబోతుంది. 

ఈ ఇద్దరి డ్యాన్సింగ్‌ ఫైర్‌కు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌ బాణీలు తోడైతే.. ఇక మాస్‌.. మాస్‌ జాతరే.. రెడీ టూ వాచ్‌ ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ మాస్‌ సాంగ్‌. మాస్‌ మ్యూజికల్‌ బొనాంజ..

Pushpa-2 the rule Gears Up for Song Release::

Pushpa-2 the rule Gears Up for Song Release - Allu Arjun and dancing queen Sreeleela to Set the Stage on Fire
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs