పవన్ కల్యాణ్‌పై కేసు.. కమిషనర్ ఏం చేస్తారో?
ఇదీ అసలు సంగతి..
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. పాతబస్తీ నుంచి కొందరు వచ్చి అంటూ ఓవైసీ బ్రదర్స్ పట్ల తీవ్ర వ్యాఖ్యలు, సంచలన ఆరోపణలు చేశారు. ఐతే వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఈ రెచ్చగొట్టి మాట్లాడటం, సవాళ్లు ఏంటి ఇవన్నీ అంటూ జనాలు చిరాకు పడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో పవన్‌పై కేసు నమోదు చేయాలంటూ ఓ నెటిజన్ చేసిన అభ్యర్థనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) సీవీ ఆనంద్ స్పందించారు. ఈ విషయంలో తదుపరి ఎలా వెళ్లాలనే దానిపై న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
సమాలోచనలు..
పవన్ వ్యాఖ్యలపై కేసు ఎలా నమోదు చేయాలి? అని పోలీసులు ఆలోచిస్తున్న వేళ పెద్ద ప్రశ్నలే వస్తున్నాయి. కేసు ఎలా పెట్టాలి అని ఆలోచించడం ఏంటి? సామాన్య ప్రజలకు ఒక్క రూల్, వాళ్ళకి ఒక్క రూల్ ఏంటి? తప్పు చెయ్యకపోయినా తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ఇస్తున్నారు అదే చెయ్యండి అదే రూల్ కదా? అందరికీ డిప్యూటీ ముఖ్యమంత్రి అయితే ఏది అయిన మాట్లాడొచ్చా? అని నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా పవన్ విషయం పోలీసులకు పెద్ద టాస్క్. ఈ వ్యవహారాన్ని ఎంత వరకూ తీసుకెళ్తారు? ఏం జరగబోతోంది? అనే దానిపై సర్వత్రా ఆసక్తి, అంతకు మించి ఉత్కంఠ నెలకొంది.