Advertisement
Google Ads BL

BB 8 - నిఖిల్ కి సింపతీ వర్కౌట్ అవుతుంది


గత రెండు రోజులుగా బిగ్ బాస్ సీజన్ 8 లో ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ సోనియా ఆకుల, బేబక్క , శేఖర్ భాషా, సీత, నైనిక, ఆదిత్య ఓమ్, నాగమణి కంట లు హౌస్ లోకి వచ్చి ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ని టార్గెట్ చేస్తూ నామినేషన్స్ వేశారు. అందులో ఎక్కువ K బ్యాచ్ అంటే కన్నడ బ్యాచ్ అయిన నిఖిల్, యష్మి , ప్రేరణ, పృథ్వీలని టార్గెట్ చేస్తూ నామినేషన్స్ వేశారు. 

Advertisement
CJ Advs

వారంతా వాళ్ళను టార్గెట్ చెయ్యగానే యష్మి ,ప్రేరణ, నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. బయట వాళ్లపై ఎంత నెగిటివిటి ఉందో అంతా వారు నామినేషన్స్ రూపంలో చెప్పారు. నిఖిల్ స్ట్రాంగ్ ఉమెన్స్ అయిన సోనియా ఆకుల, యష్మి లను ఎమోషనల్ గా కనెక్ట్ చేసి గేమ్ పాడుచేసి వాళ్ళని తనవైపు తిప్పుకుంటూ డిస్టర్బ్ చేసాడు అంటూ సోనియా నుంచి సీత వరకు చెప్పడంతో నిఖిల్ ఫీలయ్యాడు. 

నా వలన సోనియా వెళ్లిపోవడం ఏమిటి, నేను యష్మి తో చెప్పాను, కానీ ఆమె కనీసం ఫ్రెండ్స్ లా ఉండమని చెప్పింది, పట్టించుకోవడం లేదు, డస్ట్ బిన్ లా తీసేస్తున్నాడంటూ గోల చేసింది, ఇందులో నా తప్పు లేదు అంటూ నిఖిల్ కన్నీళ్లు పెట్టుకుని భోజనం కూడా చెయ్యలేదు. సోనియా, సీత టార్గెట్ చేసినప్పుడు అందరూ నిఖిల్ దె తప్పు అన్నారు. కానీ నిఖిల్ పృథ్వీ దగ్గర బాధపడినప్పుడు నిఖిల్ పై ప్రేక్షకుల్లో సింపతీ క్రియేట్ అయ్యింది. 

నిన్నటి వరకు నబీల్ ని సపోర్ట్ చేస్తూ ఓట్లేసిన ప్రేక్షకులు ఇప్పుడు నిఖిల్ ని సపోర్ట్ చేస్తున్నారు. అంటే అక్కడ నిఖిల్ కి సింపతీ వర్కౌట్ అయినట్లే కనబడుతుంది. 

BB 8 - Nikhil gets a sympathy workout:

Bigg Boss 8 - Eliminated contestants target Nikhil
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs