Advertisement
Google Ads BL

చిరుకి-బాలయ్యకు తేడా అదే


మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ లతో రీసెంట్ టైమ్స్ లో పనిచేసిన ఓ దర్శకుడు ఇద్దరికి మధ్యన ఉన్న తేడాని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ తో వాల్తేర్ వీరయ్య సినిమా చేసి సక్సెస్ సాధించిన బాబీ కొల్లి రవీంద్ర ప్రస్తుతం బాలకృష్ణ తో డాకు మహారాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుంది. 

Advertisement
CJ Advs

తాజాగా బాబీ ఓ ఇంటర్వ్యూలో బాలయ్యకు చిరుకు మధ్యన ఉన్న తేడా ను చెప్పారు. మెగాస్టార్ చిరు కథ ఏమిటి అని ముందే అడుగుతారు, ఆయన సీన్ చేసే ముందు సీన్ పేపర్ చదువుతారు, ఆయన అనుభవం ముందు మనమెంత. కానీ బాలకృష్ణ దర్శకుడిని నమ్మి సినిమాలు చేస్తారు, బాలయ్య ఒకసారి కథ ఓకే చేశాక ఆయన దర్శకుడిని గుడ్డిగా నమ్ముతారు. వేరే ఏది పట్టించుకోరు. దర్శకుడు ఏం చెబితే అది చేసుకుపోతారు. 

బాలయ్య గారితో సినిమా చెయ్యడం నా అదృష్టం. ఇక్కడ పారితోషికాలు పక్కనపెడితే.. అభిమానులు కాలర్ ఎగరేసేలా సినిమా తియ్యాలనేది నా కోరిక, అందుకు తగిన విధంగానే అభిమానులు మెచ్చేలానే డాకు మహారాజ్ చేస్తున్నట్టుగా బాబీ చెప్పుకొచ్చారు.  

The difference between Chiru and Balayya:

The difference between Chiranjeevi and Balakrishna 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs