Advertisement
Google Ads BL

విడాకుల ట్రెండ్ ని ఫాలో అవుతున్న రెహమాన్


ఈమధ్యన కోలీవుడ్ లో విడాకుల ట్రెండ్ నడుస్తుంది. సెలబ్రిటీస్ విడాకులు తీసుకుంటూ అభిమానులను నొప్పిస్తున్నారు. ధనుష్-ఐశ్వర్య విడాకుల విషయం ఎంత సెన్సేషన్ అయ్యిందో.. రీసెంట్ గా జయం రవి-ఆర్తి ల విడాకుల విషయము అంతే రచ్చ అయ్యింది. అంతేకాదు రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ భార్యతో విడిపోయాడు. ఇప్పడు ఈ ట్రెండ్ ని ఈ వయసులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఫాలో అవడం అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. 

Advertisement
CJ Advs

లైఫ్ లో, మ్యూజిక్ ప్రపంచంలో ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొని ఆస్కార్ స్థాయికి ఎదిగిన ఏ ఆర్ రెహమాన్ అంటే తెలియని వారుండరు. ఇప్పుడు రెహమాన్ దాదాపు మూప్పై ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలకడం షాకిచ్చే విషయం కాక ఇంకేమవుతుంది. తాజాగా రెహమాన్ భార్య సైరా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికి రెహమాన్ నుంచి తాను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె లాయర్ ద్వారా ప్రకటించారు. 

రెహమాన్-సైరా విడిపోవడానికి కారణం ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలే.. ఒకరిపై మరొకరికి విపరీతమైన ప్రేమ ఉన్నప్పటికీ.. కానీ తమ మధ్య ఏర్పడిన విభేదాలు, వివాదాలు వాటిని అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయని అందుకే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా సైరా లాయర్ వందనా షా వివరించారు. 

ఈ విడాకుల విషయంలో రెహమాన్ కూడా రియాక్ట్ అయ్యారు. మేము ఎంతో హ్యాపీ గా ముప్పైకి చేరుకోవాలని ఆశించాము. కానీ అన్నిటికీ ఓ ఎండింగ్ పాయింట్ కలిగి ఉంటుంది అని అర్ధమైంది. ముక్కలైన హృదయాల బరువుకు ఆ దేవుడి సింహాసనం సైతం వణుకుతుంది. అయినా ఈ ముగింపులో మేము మరో అర్థాన్ని వెతుకుతున్నాము. విరిగిన ముక్కలు మళ్లీ అతకవు అంటూ రెహమాన్ తన భార్యతో విడిపోయినట్లుగా ప్రకటించారు. 

AR Rahman is following the divorce trend:

AR Rahman and Wife Saira Banu Separate After 29 Years of Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs