Advertisement
Google Ads BL

భాగ్యశ్రీ బోర్సే కి బంపర్ ఆఫర్


మిస్టర్ బచ్చన్ చిత్రంలో రవితేజ తో కలిసి హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయమైన గ్లామర్ డాల్ భాగ్యశ్రీ బోర్సేకి మిస్టర్ బచ్చన్ బిగ్ షాకిచ్చినప్పటికీ ఆమెకి వరసగా టాలీవుడ్ అవకాశాలు తలుపు తట్టడం షాకిచ్చే విషయమే. ఇప్పటికే లక్కీ భాస్కర్ తో 100 కోట్లకు పైగా కొల్లగొట్టిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తో కాంత చిత్రంలో జోడి కట్టే అవకాశం దక్కించుకున్న భాగ్యశ్రీ బోర్సేకి ఇప్పుడు ఉస్తాద్ రామ్ అవకాశం ఇచ్చారు. 

Advertisement
CJ Advs

రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ #RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. హీరోగా రామ్ కి ఇది 22వ సినిమా ఇది. 

#RAPO22 హీరోయిన్‌గా యంగ్ అండ్ హ్యాపెనింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఎంపిక అయ్యింది. మొదటి సినిమాతో గ్లామర్, యాక్టింగ్ చేయగల నటిగా పేరు తెచ్చుకుంది. రామ్, భాగ్యశ్రీ జంటగా రూపొందుతున్న మొదటి చిత్రమిది. వాళ్ళిద్దరి పెయిర్, సీన్స్ సినిమా హైలైట్స్‌లో ఒకటి అవుతాయని యూనిట్ అంటోంది.

Bhagyashi Borse onboards RAPO22:

Bhagyashi Borse onboards Ram Pothineni, Mahesh Babu P, Mythri Movie Makers RAPO22
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs