Advertisement
Google Ads BL

BB 8 - టైటిల్ రేస్ నుంచి తప్పించారుగా


బిగ్ బాస్ సీజన్ 8 మొదలయ్యాక టైటిల్ ఫెవరేట్ గా ఓ ఇద్దరు కనిపించారు. అందులో యాంకర్ విష్ణు ప్రియా మరొకరు నిఖిల్. విష్ణు ప్రియా తన అమాయకత్వంతో టైటిల్ రేస్ నుంచి తప్పుకుంది, మరొకరు నిఖిల్ కండ బలంతో వచ్చిన ప్రతి టాస్క్ గెలిచి తన స్టామినా వారం వారం ప్రూవ్ చెయ్యడమే కాదు, నామినేషన్స్ లోకి వచ్చిన ప్రతిసారి అందరికన్నా ఎక్కువగా ఓట్లు కొల్లగొడుతున్నారు.

Advertisement
CJ Advs

కానీ గౌతమ్ వచ్చాక నిఖిల్ గేమ్ ఎఫెక్ట్ అయ్యింది. గౌతమ్ రాకముందు నిఖిల్ తో అంతగా పోటీపడే వారు లేరు. ముందుగా సోనియా చుట్టూ తిరిగిన నిఖిల్ ఆమె వెళ్ళిపోగానే యష్మి ని తగులుకున్నాడు. ఆమెలో ఆశలు రేపి తాను మాత్రం యష్మి దే తప్పు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసాడు.

సోనియా ఆకుల దగ్గర నుంచి కిర్రాక్ సీత వరకు నిఖిల్ ని ఎక్స్ పోజ్ చేసారు. నిఖిల్ కప్పుకున్న ముసుగుని తీసేసారు. కొద్దో గొప్పో నిఖిల్ గేమ్ అర్థమైనా బుల్లితెర ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ నిఖిల్ ముసుగు తొలగించడం తో క్లారిటీ వచ్చేసింది.

అందుకే నబీల్, గౌతమ్ ల వైపు బుల్లితెర ఆడియన్స్ షిఫ్ట్ అవుతున్నారు. నిఖిల్ ప్రస్తుతం నామినేషన్స్ లోకి వస్తే.. నిఖిల్ ని పక్కనపెట్టి అతనితో పాటుగా నామినేషన్స్ లో ఉన్న నబీల్ ని టాప్ లో పెట్టడంతో నబీల్ ఇప్పుడు టైటిల్ ఫెవరేట్ గా మారిపోయాడు. 

BB 8: Eliminated from the title race..:

Bigg Boss 8 - Kirrak Seetha Comments On Nikhil
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs