Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 8 - కన్నడ బ్యాచ్ కి కన్నీళ్ళే


బిగ్ బాస్ 8 లో ఇప్పటివరకు గ్రూప్ కట్టి ఆడుతూ నామినేషన్స్ వేసుకోని కన్నడ సీరియల్ బ్యాచ్ కి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ చుక్కలు చూపిస్తున్నారు, కన్నడ బ్యాచ్ తప్పులను ఎత్తి చూపుతుంటే వాళ్లకు సమాధానం చెప్పలేక బిక్క మొహం వేస్తున్నారు. K బ్యాచ్ నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, యష్మి లకు ఈ వారం నామినేషన్స్ హీట్ మాములుగా లేదు.

Advertisement
CJ Advs

సోమవారం ఎపిసోడ్ లో ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టి ఇప్ప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేట్ చెయ్యమంటే సోనియా ఆకుల ప్రేరణ, నిఖిల్ ని టార్గెట్ చేసింది, ఆతర్వాత వచ్చిన బేబక్క నిఖిల్, పృథ్వీలను నామినేట్ చేసింది, శేఖర్ భాషా ప్రేరణ, యష్మి లను నామినేట్ చేసాడు.

ఈ రోజు ఎపిసోడ్ లోను నాగమణికంఠ నిఖిల్ ని నామినేట్ చేసాడు. ఈ రోజు కూడా కన్నడ బ్యాచ్ కి చుక్కలు చూపించేందుకు ఓల్డ్ కంటెస్టెంట్స్ రెడీ అయ్యారు. యష్మి, ప్రేరణలను సీత.. యష్మిను నైనిక నామినేట్ చేసింది. వాళ్ళు నామినేట్ చేస్తుంటే డిఫెండ్ చేసుకుంటూనే బిక్కమొహాలు వేస్తున్నారు.

ప్రేరణ, యష్మి, నిఖిల్, పృథ్వీ మీరు ఫ్రెండ్స్, అందుకే ఒకళ్ళని ఒకళ్ళు కాపాడుకుంటూ నామినేట్ చేసుకోరు అంటూ ప్రతి ఒక్కళ్ళు నామినేషన్స్ పాయింట్స్ లో యాడ్ చేసేసరికి కన్నడ బ్యాచ్ కి కన్నీళ్లే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Bigg Boss 8 - Tears for the Kannada batch:

Nikhil - Prerna - Prithvi and Yashmi are in nominations this week
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs