Advertisement
Google Ads BL

జగన్ ఇక మారే ప్రసక్తే లేదు


జగన్ సీఎం అయ్యాక తాడేపల్లి ప్యాలెస్ లో రెస్ట్ తీసుకోవడానికి సమయం లేదు, ఆయన చుట్టూ కోటరి కట్టిన సజ్జల, ధనుంజయ్ రెడ్డి లాంటి వాళ్లు కార్యకర్తలను జగన్ కలవకుండా చెయ్యడం తోనే జగన్ కి 2024 ఎన్నికల్లో అధికారం చేజారి పోయింది, ఇప్పుడు ఓడిపోయాక అయినా జగన్ కళ్ళు తెరిచి కార్యకర్తలకు విలువిస్తే జగన్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యి అధికారం చేపడతారు అంటూ బ్లూ మీద నెత్తి నోరు కొట్టుకుంది. 

Advertisement
CJ Advs

కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం మారనంటున్నారట. 

మూడు రోజులు తాడేపల్లి ఇంటి దగ్గర నాలుగు రోజులు బెంగుళూరు ప్యాలెస్ అంటూ జగన్ తిరుగుతున్నారు. ఇక్కడ తాడేపల్లి లో ఉంటే కార్యకర్తలను కలుస్తారు అనుకుంటే అదీ లేదు, పదిమంది ఎమ్యెల్యే ల దగ్గరకు వెళ్లి కార్యకర్తలు జగన్ ను కలిపించాలని అడుగుతున్నా వాళ్ళు కూడా ఏం చెయ్యలేకపోతున్నారట. వాళ్లకే దిక్కు లేదు. ఇప్పటికి జగన్ బిజీ అనే బిల్డప్ తప్ప ఇంకేమి లేదు. 

జగన్ ఓడిపోయాకే బిజి అంటూ ఆయన చుటూ ఉన్న నేతలు చెప్పడం హాస్యాస్పదం, అది చూసే జగన్ ఇక మీరు మారరా అంటూ వైసీపీ కార్యకర్తలే మాట్లాడడం మాత్రం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. ఇక కొంతమందికి జగన్ ని కలవాలని కోరిక కూడా సచ్చపోతుందట, జగన్ కి  ఇవన్నీ తెలియకుండా చుట్టూ ఉన్న వారు మ్యానేజ్ చెయ్యడం అనే మాట వింటే నవ్వొస్తుంది. జగన్ ఎంతగా ఇంటికే పరిమితమైనా ఇవన్నీ తెలుసుకోలేని అమాయకుడైతే కాదు కదా అనేది అందరి వాదన. అంతేగా.. అంతేగా.. 

Jagan is not about to change:

What are the gravest mistakes of Jaganmohan Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs