Advertisement
Google Ads BL

నయన్ ని అంతలా వంచించింది ఎవరు


లేడీ సూపర్ స్టార్ నయనతార బర్త్ డే స్పెషల్ గా నెట్ ఫ్లిక్స్ లో నయనతార డాక్యుమెంటరీ బయో పిక్ గా బియాండ్ ది ఫెయిరీ టేల్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ డాక్యుమెంటరీలో తన గత జీవితము(లవ్ ఎఫ్ఫైర్స్ ) ప్రేమ, పెళ్లి, అలాగే కుటుంబం.. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని పంచుకుంది. అంతేకాదు నయనతార తో పని చేసిన హీరోలు, టెక్నీకల్ సిబ్బంది కూడా నయన్ గురించి ఈ డాక్యుమెంటరీలో షేర్ చేసారు. 

Advertisement
CJ Advs

అయితే ఇందులో నయనతార తన పర్సనల్ లైఫ్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నయనతార తో బాస్ మూవీలో కలిసి నటించిన నాగార్జున మాట్లాడుతూ.. నయన్ కు సెట్ లో ఉండగా ఫోన్ వస్తే భయపడిపోయేది, ఆ తర్వాత మూడ్ మొత్తం మారిపోయేది, ఫోన్ లో ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉండేది. తన రిలేషన్ షిప్ లోనే సమస్య ఉందని అనిపించేదన్నారు. దీనికి నయనతార రియాక్ట్ అయ్యింది. 

ప్రేమ అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది, తాను అతన్ని మనస్ఫూర్తిగా నమ్మానని, అతను కూడా తనను అంతే ప్రేమిస్తున్నాడని అనుకున్నాను, కానీ ప్రేమిస్తున్నట్టుగా తనను నమ్మించాడు, తన గత లైఫ్, అలాగే రిలేషన్స్ గురించి ఎక్కడా మాట్లాడకపోయినప్పటికీ బయట మాత్రం తన గురించి ఇష్టం వచ్చినరీతిలో మాట్లాడుకున్నారని, తాను ఒక అమ్మాయిని కాబట్టి ఇలా, అదే అబ్బాయి అయితే అలా మాట్లాడేవారు కాదు. 

అబ్బాయిలను మీరెందుకు ఆ అమ్మాయిని మోసం చేసారు అని అడగరు,  అమ్మాయిలను మాత్రం ఆ అబ్బాయిని ఎందుకు మోసం చేసావని అడుగుతారు. తప్పంతా అమ్మాయిలదే అన్నట్లుగా ప్రచురిస్తారు అంటూ నయన్ ఎమోషనల్ అవ్వగా.. ఆమెని అంతలా వంచిన ఆ హీరో ఎవరో అంటూ ఆరాలు తీస్తున్నారు జనాలు. 

Nayanthara talks past relationships:

Nayanthara talks past relationships in her Netflix documentary
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs