Advertisement
Google Ads BL

మెగా కాంపౌండ్ నుంచి ట్వీటే లేదు


పుష్ప ద రూల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అర్ధమవుతుంది. పాట్నా లో అల్లు అర్జున్, రష్మికలు హాజరైన పుష్ప ద రూల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురించి ప్రపంచమంతా మాట్లాడుతుంది. ఆ పాట్నా ఈవెంట్ చూసాక నార్త్ హీరోల గుండెల్లో రైలు పరిగెత్తడం ఖాయం. అందరికి క్రేజ్ ఉంటుంది. కానీ అల్లు అర్జున్ కి అది కుసింత ఎక్కువ అనేది బీహార్ లోని పాట్నా పుష్ప ఈవెంట్ నిరూపించింది. 

Advertisement
CJ Advs

పుష్ప ట్రైలర్ ఎలా ఉంది అనేది కూడా మాట్లాడడం లేదు, కేవలం పాట్నా లో జరిగిన ఆ ఈవెంట్ మీదే అందరి చర్చ, ట్రూ పాన్ ఇండియా ఈవెంట్, అల్లు అర్జున్ క్రేజ్ ఆకాశమే హద్దు అంటూ మాట్లాడుతున్నారు. అయితే పుష్ప 2 ఈవెంట్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే.. మెగా కాంపౌండ్ ఉంచి ఎలాంటి అప్రిషేషన్స్ లేకపోవడం అందరిని విస్మయానికి గురు చేసింది.

ప్రతి చిన్న సినిమాకి, పెద్ద సినిమాకి ట్వీట్లు వేసే మెగాస్టార్ కానీ, రామ్ చరణ్ కానీ ఏ ఒక్కరూ పుష్ప ట్రైలర్ గురించి కానీ, ఈవెంట్ గురించి కానీ ట్వీట్ వేయకపోవడం అందరికి షాకిచ్చింది. వరుణ్ తేజ్, సాయి ధరమ్ లంటే కోపం మీదున్నారు అనుకోవచ్చు. కానీ చిరు, చరణ్ కూడా స్పందించకపోవడమే హాట్ టాపిక్ అయ్యింది.  

There is no tweet from the Mega compound:

All Mega Heroes Ignored Pushpa 2 Trailer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs