టీటీడీ కి కొత్త చైర్మన్ గా ఎన్నికైన బీఆర్ నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు
అన్యమతస్తులను వేరే చోటకు బదిలీ చేయాలని నిర్ణయం
శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు పునరుద్ధరణ
గతంలో సీఎం చంద్రబాబు గరుడ వారధిగా ప్రాజెక్టు ప్రారంభించారు - దానిని గత ప్రభుత్వం శ్రీనివాస సేతుగా పేరు మార్చింది - ఇప్పుడు గరుడ వారధిగా పేరును కొనసాగించాలని నిర్ణయం
శ్రీవాణి ట్రస్ట్‌ను రద్దు చేసి.. ప్రధాన ట్రస్ట్‌కే ఆ నిధులు తరలిస్తాం - శ్రీవాణి పథకం మాత్రం కొనసాగుతుంది
నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుస్తాం
లడ్డూలోని నెయ్యి నాణ్యతను మరింత పెంచాలని నిర్ణయం
టీటీడీ ఉద్యోగులకు 10 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం - ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయం
టూరిజం శాఖ ద్వారా ఇచ్చే టికెట్లను రద్దు చేయాలని నిర్ణయం - టూరిజం శాఖ ఇచ్చే 4 వేల టికెట్ల రద్దుకు నిర్ణయం - టూరిజం శాఖ ఇచ్చే టికెట్లలో అవకతవకలు జరిగాయి
ఏఐ సహకారంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం
ఏళ్ల తరబడి డంపింగ్ యార్డులో పేరుకున్న చెత్తను తొలగిస్తాం
తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలపై పూర్తిగా నిషేధం - తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు
తిరుపతిలోని స్థానికులకు ప్రతినెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం
శారదాపీఠం లీజు రద్దు చేసి స్థలం స్వాధీనం చేసుకుంటాం