Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ స్టామినా ప్రూవ్ అయ్యింది


సింగిల్ హ్యాండ్ తో చితక్కొట్టేయ్యడం అంటే ఇదేనేమో.. ఒక్క ఈవెంట్, ఒకే ఒక ఈవెంట్ అల్లు అర్జున్ స్టామినా ఏమిటో ప్రూవ్ చేసింది. పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు, నేషనల్ అవార్డు వచ్చింది అది ఓకె కానీ.. అసలు అల్లు అర్జున్ క్రేజ్ నార్త్ లో ఎంతుంది అనేది చాలామందిలో ఉన్న అనుమానం. 

Advertisement
CJ Advs

వాటన్నిటికీ పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సమాధానం చెప్పింది. సింగిల్ హ్యాండ్ తో తన క్రేజ్ ఏమిటో చూపించాడు అల్లు అర్జున్. సుకుమార్ పాన్ ఇండియా స్టార్ కి ఇవ్వాల్సిన ఎలివేషన్ ఎంతిచ్చినా, ట్రైలర్ కూడా విడుదల కాక ముందు అల్లు అర్జున్ కోసం నార్త్ ఆడియన్స్ ఇంత అభిమానం చూపించడం మాత్రం గొప్పగా చెప్పుకునే విషయం. 

ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు వెనుక రాజమౌళి ఉన్నారు. కాని అల్లు అర్జున్ వెనుక ఎవరున్నారు, సుకుమార్ ప్లానింగ్ ఉన్నా దానిని ఎగ్జిక్యూట్ చెయ్యడానికి ఆయన లేరు, కానీ అల్లు అర్జున్ ఒక్కడే తన వెనుక ఉన్న బలాన్ని చూపించాడు. తన వెనుక ఆర్మీ ఉంది అనడం కాదు విజువల్ గా ప్రూవ్ చేసాడు. మరి ఈ లెక్కన పుష్ప 2 కలెక్షన్స్ లెక్కెట్టడానికి ఎన్ని రోజులు పడుతుందో అంటూ అల్లు అభిమానులు అప్పుడే పండగ చేసుకుంటున్నారు. 

ఇది నిజం అల్లు అర్జున్ ఒక్కడే అసలు సిసలు పాన్ ఇండియా స్టార్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే పాట్నాలో జరిగిన పుష్ప 2 ఈవెంట్ విశేషాలే కనబడుతున్నాయి. అది లెక్క. 

Allu Arjun stamina is proved:

Allu Arjun Proves His Stamina With Pushpa 2 trailer launch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs