Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 8: రివెంజ్ తీర్చుకున్న సోనియా


బిగ్ బాస్ సీజన్ 8 లో నిఖిల్-పృథ్వీలను చిన్నోడు, పెద్దోడు అంటూ తన చుట్టూ తిప్పుకుని వాళ్ళ మధ్యలోనే గేమ్ ఆడిన సోనియా ఆకుల ను బుల్లితెర ప్రేక్షకులు చాలా తొందరగా హౌస్ నుంచి బయటికి పంపించేశారు. సోనియా ఇమేజ్ ఆ నాలుగు వారాల్లోనే డ్యామేజ్ అవడంతో సోని బిగ్ బాస్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ కంటెంట్ కోసం నన్ను బలి పశువును చేసారంటూ మొత్తుకుంది. 

Advertisement
CJ Advs

మరోసారి బిగ్ బాస్ అవకాశం వస్తే వెళ్ళను అని ఖరాఖండిగా చెప్పిన సోని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో తేలింది. 

అంతేకాదు తన రివెంజ్ తీర్చుకునట్టుగా సోమవారం ఎపిసోడ్ లో చూపించబోతున్నారు. ఈ వారం ఇప్పటికే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారు హౌస్ లోకి వచ్చి కంటెస్టెంట్స్ ని నామినేట్ చేస్తారంటూ ట్విస్ట్ ఇచ్చారు.  వారితో ఇద్దరేసి ఇంటి సభ్యులను నామినేట్ చేయాలని చెప్పాడు. ఆ వెంటనే డోర్స్ ఓపెన్ అవ్వగా.. ఎదురుగా సోనియా ఆకుల ప్రత్యక్షమైంది. 

సోనియా ఆటిట్యూడ్ చూపిస్తూ చైర్ లో కూర్చుని ప్రేరణ ను నామినేట్ చెయ్యగానే అక్క చెప్పు అంది ప్రేరణ, దానికి చెల్లి చెబుతా అంటూ ప్రేరణ పై ఫైర్ అయ్యింది సోనియా. ఆ తర్వాత యష్మి - నిఖిల్ మధ్య క్లోజ్ గా వున్నా పాయింట్ తీసి నిఖిల్ ని నామినేట్ చెయ్యడం అందరికి షాకిచ్చింది. ఆ గొడవలో నిఖిల్-యష్మి తగువు పడ్డారు. సోనియా అయితే రెచ్చిపోతూ నిఖిల్ ని నామినేట్ చెయ్యడం బుల్లితెర ఆడియన్స్ కి అలాగే హౌస్ మేట్స్ కి పెద్ద షాక్ ఇచ్చింది. 

Bigg Boss 8: Sonia takes revenge:

Bigg Boss 8: Sonia nominates Nikhil and Prerana
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs