రాయపాటి అరుణ.. ఏమిటీ దారుణం!
జనసేన రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు రాయపాటి అరుణ.. మూడు, నాలుగు రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. వినిపిస్తున్న, కనిపిస్తున్న పేరు. ఎందుకంటే ఈమె చేసిన ఘనకార్యం అలాంటిది మరి. ఎంతలా అంటే సొంత పార్టీ కార్యకర్తలు, నేతలే చీ ఛీ అంటూ చీదరించుకునేంత. అసలు మేడం గారు చేసిన అతి ఏంటి? ఎందుకు ఇంతలా సొంత పార్టీ వాళ్ళే తిట్టిపోస్తున్నారు? ఇంత జరుగుతున్నా జనసేన పెద్దలు ముఖ్యంగా అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనం పాటిస్తున్నారు? నాగబాబు ఎందుకు నోరు మెదపడం లేదు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి.
టూ మచ్ మేడం!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 11 నుంచి జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. బడ్జెట్ ప్రవేశపెట్టడం, దానిపై చర్చ అన్నీ అయ్యాయి కూడా. అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డుమ్మా కొట్టగా, ఎమ్మెల్సీలు మాత్రం హాజరవుతున్నారు. రోజూ ఏదో ఒక టాపిక్ మీద పెద్ద రచ్చే అవుతోంది. ఈ క్రమంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్ డెబెట్ లో పాల్గొన్న రాయపాటి అరుణ టూ మచ్ మాటలు మాట్లాడారు.
జగన్ మోహన్ రెడ్డి ఎవరికి పుట్టారు..? ఆయన పిల్లలు..? ఆయన సంబంధాలు ఇవేమీ అసెంబ్లీ చర్చకు రానివ్వం అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడారు. దీంతో అసలు మనిషి, అందులోనూ ఆడపిల్ల మాట్లాడే మాటలేనా ఇవి? అంటూ సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు కన్నెర్ర చేస్తున్న పరిస్థితి.
అధినేత అలా.. నేతలు ఇలా!
పవన్ కళ్యాణ్ నోరు తెరిస్తే చాలు మాది సంస్కారం ఉన్న పార్టీ.. మహిళలకు గౌరవం ఇస్తాం.. ఆడపిల్లలపై ఈగ కూడా వాలనివ్వం అని పదే పదే చెబుతుంటారు. అధినేత మాటలు ఇలా అంటే.. ఇక ఆ పార్టీ వీర మహిళలు మాత్రం నోరు తెరిస్తే పచ్చి బూతులు వస్తున్నాయ్. ఒక్కసారి ఆమె మాట్లాడిన మాటలు చూస్తే చీ ఛీ అని చీదరించుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. పోనీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈమెను ఏమైనా అంటే కేసులు, అరెస్టులు, కోర్టులు గట్రా చాలానే ఉంటాయ్. ఇంత అతి మాటలు అవసరమా. రాజకీయంగా విమర్శలు చేయుచ్చు కానీ.. వ్యక్తిగత విమర్శలు, ఇంట్లో వారిని రాజకీయాల్లోకి లాగడం ఎంత వరకూ సమంజసం అని వైసీపీ సోషల్ మీడియా కన్నెర్ర చేస్తున్నది. పోనీ ఇదే అరుణ గురుంచి ఎవరైనా మాట్లాడితే ఊరికే ఉంటారా..? అనేది ఒక్కసారి తెలుసుకుని మసులుకుంటే మంచిది.
ఇదేం కొత్త కాదు..!
అరుణకు ఇలా మాట్లాడటం కొత్తేమీ కాదు. అప్పట్లో మెగా ఫ్యామిలీ పైన జనసేనలో అంటూనే అభ్యంతర మాటలు మాట్లాడిన సందర్భం కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు గురుంచి మాట్లాడిన మాటలతో అప్పట్లో కొందరు నేతలు కలుగజేసుకుని సర్ది చెప్పడంతో వివాదం సర్దుమణిగింది. అప్పట్లోనే జనసేన నుంచి పీకేస్తారని చర్చ జరిగింది కానీ అది జరగలేదు. ఇప్పుడేమో ఏకంగా వైఎస్ జగన్, ఆయన పిల్లలు, భార్య గురుంచి ఇష్టానుసారం మాట్లాడేశారు. మూడు రోజులుగా ఈమె మాటలపై ఎక్కడ చూసినా చర్చించుకుంటున్నారు. పోనీ ఒక్క క్షమాపణతో పోయే మాటలేనా?. ఇకనైనా పవన్ కళ్యాణ్, నాగబాబు రంగంలోకి దిగి అరుణ లాంటి వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అసలే సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడిన వాళ్ళను అరెస్ట్ చేస్తున్న ఈ తరుణంలో ఇప్పుడు ఈమెపై ఫిర్యాదులు చేయొచ్చు..? జనసేనను ఇరకటంలోనూ పెట్టొచ్చు.. అందుకే ఆదిలోనే హెచ్చరించి, నోరు అదుపులో పెట్టుకునేలా చేస్తే ఎందుకైనా మంచిది. లేదంటే ఇంతకు మించి మాటలు రేపు రావొచ్చు.. అప్పుడిక పరిస్థితులు అదుపులో ఉండకపోవచ్చు.