Advertisement
Google Ads BL

కంగువ ను కావాలనే తోక్కేస్తున్నారు


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ చిత్రం కంగువ, ఈ చిత్రం నవంబర్ 14 న భారీగా పాన్ ఇండియా మర్కెట్ లో విడుదలైంది. కంగువ చిత్రానికి అన్ని భాషల వారు మిక్స్డ్ రివ్యూస్ ఇస్తే.. సోషల్ మీడియాలో కంగువ పై మొదటిరోజు నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. కంగువ లో ఫస్ట్ హాఫ్ మాత్రమే కాదు, దర్శకత్వం, మ్యూజిక్, BGM మైనస్ అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు, క్రిటిక్స్ యునానమస్ గా రివ్యూస్ ఇచ్చారు. 

Advertisement
CJ Advs

అయితే సూర్య వైఫ్ నటి జ్యోతిక కంగువ ను కావాలనే తోక్కేస్తున్నారు అంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కంగువ చిత్రంలో తోలి 20 నిముషాలు బాలేదు, అంతేకాదు BGM కూడా మైనస్, తప్పులు ఎవ్వరు చెయ్యరు, ఇలాంటి సినిమాల్లో పొరపాట్లు జరుగుతుంటాయి. మళ్లీ చెబుతున్నాను కంగువ చిత్రంలో తోలి అరగంట మాత్రమే బాలేదు, కానీ చాలామంది క్రిటిక్స్ సినిమాని కిల్ చేస్తూ రివ్యూస్ ఇచ్చారు. 

మీడియా వారు, కొంతమంది క్రిటిక్స్ కంగువ కు నెగెటివ్ రివ్యూస్ షాకిచ్చాయి. వారు రొటీన్ కథలతో, అమ్మాయిల వెంటపడే కథల్తో సినిమాలు తీస్తే ఇలాంటి రివ్యూస్ ఇవ్వడం చూడలేదు. కంగువ లో అన్ని మైనస్ లు చూపించారు, మరి ప్లస్ ల సంగతేమిటి, మొదటి రోజే కంగువ పై ఇంత నెగిటివిటి చూపిస్తుంటే బాధగా అనిపించింది. 

కాన్సెప్ట్, కష్టానికి ప్రశంశలు దక్కపోగా ఇలాంటివా.. ఇదంతా చూస్తే కంగువ పై కావాలనే నెగిటివిటీ చూపిస్తూ తొక్కేయాలని ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది అంటూ సూర్య వైఫ్ జ్యోతిక తన ఇన్స్టా స్టోరీస్ లో రాసుకొచ్చింది. 

Jyothika Angry on Kanguva negative reviews:

Jyothika expresses surprise at the negativity surrounding Kanguva
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs