Advertisement
Google Ads BL

నయన్ పై ధనుష్ ప్రొడ్యూసర్ ఫైర్


నయనతార నిన్న హీరో ధనుష్ కి రాసిన ఓపెన్ లెటర్ సంచలనం సృష్టించింది.నయనతార ధనుష్ ని ఎంతగా బ్లేమ్ చెయ్యాలో అంతగా బ్లేమ్ చేసింది. ధనుష్ నువ్వు అభిమానులకు నీతులు చెప్పడం కాదు నువ్వు పాటించాలి, ఓ చిన్న క్లిప్ వాడుకున్నందుకు 10 కోట్లు డిమాండ్ చెయ్యడం నీ వ్యక్తిత్వానికి నిదర్శనం అంటూ నయనతార ధనుష్ పై విరుచుకుపడింది. తన డాక్యుమెంటరీలో తాను నటించిన సినిమా నుంచి మూడు సెకన్ల క్లిప్ వాడుకుంటే తప్పా అంటూ నయన్ ప్రశ్నించింది. 

Advertisement
CJ Advs

ఈ విషయంలో కొంతమంది హీరోయిన్స్ నయనతార కు మద్దతుగా నిలుస్తున్నారు. నయనతార లాంటి పెద్ద హీరోయిన్ విషయంలోనే ఇలా చేసారంటే మిగతా వాళ్ళ విషయంలో ఎలా ఉంటుందో అంటూ వారు మాట్లాడుతున్నారు. మరోపక్క ధనుష్ ఫ్యాన్స్ నయన్ పై ఫైర్ అవుతున్నారు. నీ భర్త విగ్నేష్ శివన్ కు లైఫ్ నిచ్చింది ధనుష్ కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావ్ అంటూ నయనతార ని ఏసుకుంటున్నారు. 

అయితే ధనుష్ నిర్మాత ఒకరు నయనతార పై ఫైర్ అవడం కాదు నయనతార గురించిన నిజాలు బయటపెడుతున్నారు. నువ్వు కోట్లు పుచ్చుకుని నెట్ ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ హక్కులు అమ్ముకున్నప్పుడు.. ధనుష్ ప్రొడ్యూస్ చేసిన సినిమా నుంచి కంటెంట్ ఉచితంగా ఎలా అడుగుతున్నారు అంటూ నయనతార పై ఫైర్ అయ్యారు. 

పెళ్లి వీడియోలను కూడా నెట్ ఫ్లిక్స్‌కు అమ్మేసిన కమర్షియల్ హీరోయిన్ నయనతార. LIC టైటిల్ హక్కులు నావైనప్పుడు మీరు నా అనుమతి లేకుండానే నా టైటిల్ తీసుకున్నారంటూ ఆ ప్రొడ్యూసర్ నయన్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. 

Dhanush producer fires on Nayanthara:

Nayanthara blasts Dhanush over legal notice
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs