పుష్ప 1 చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, నేపధ్య సంగీతం అన్ని ఓ లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే అంచనాలు పుష్ప2 పై లేవనే మాట అభిమానులను కలవరపెడుతుంది. కారణం దేవిశ్రీ ప్లేస్ లోకి మరో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రావడమే. మ్యూజిక్ దేవిశ్రీ ఇస్తే.. నేపధ్య సంగీతానికి థమన్ మరికొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు.
అక్కడే మ్యూజిక్ లవర్స్ కి పుష్ప 2 పై నమ్మకం కోల్పోయేలా చేసింది. అవుట్ ఫుట్ బావుంటే ఓకె. తేడా వస్తే మాత్రం మాములుగా ఉండదు. అదే ఇప్పుడు ప్రాబ్లెమ్ అనుకుంటే.. పుండు మీద కారం చల్లినట్టుగా పుష్ప 2 విడుదలకు ముందు దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన కంగువ చిత్రం BGM పై పలు విమర్శలు అల్లు అభిమానులను ఆందోళనకు గురి చేసాయి.
దేవిశ్రీ ప్రసాద్ కంగువ యాక్షన్ ఘట్టాల్లో ఇచ్చిన నేపధ్య సంగీతం అక్కడక్కడా చెవులు పగిలిపోయాయనే కంప్లైంట్ చాలామంది ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది. కొన్ని చోట్ల దేవిశ్రీ మ్యూజిక్ వర్కౌట్ అయినా.. మరికొన్ని చోట్ల దేవిశ్రీ BGM పూర్తిగా నిరాశపరిచింది అనే మాట కంగువ చూసిన ఆడియన్స్ నుంచి వినిపిస్తోంది.
మరి పుష్ప 2 విడుదలకు ముందు కంగువ తో నిరాశపరిచిన దేవిశ్రీ ప్రసాద్ పై ఏ రకమైన నమ్మకం పెట్టు కోవాలో అనే దిగులు అల్లు ఫ్యాన్స్ లో మొదలైంది. నిజంగా ఇది పుష్ప 2కి డ్యామేజ్ అనే చెప్పాలి.