Advertisement
Google Ads BL

మీనాక్షితో అక్కినేని హీరో పెళ్లి.. నిజమా.?


ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే.. ఆమె మీనాక్షి చౌదరి అనే చెప్పాలి. మీనాక్షి చౌదరి టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తుంది. లక్కీ భాస్కర్ తో 100 కోట్ల హీరోయిన్ అయ్యింది. లక్కీ భాస్కర్ లో మీనాక్షి చేసిన సుమతి పాత్రను ప్రేక్షకులు ఇప్పుడప్పుడే మరిచిపోలేరు 

Advertisement
CJ Advs

మీనాక్షి చౌదరి ఇప్పుడు పెళ్ళికి రెడీ అయ్యిందా? ఆమె అక్కినేని హీరో సుశాంత్ ని వివాహం చేసుకోబోతుందా? అనే వార్తలు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సుశాంత్-మీనాక్షి చౌదరి కలిసి ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాకి వర్క్ చేసారు. అయితే మీనాక్షి చౌదరిని.. మీరు సుశాంత్ ని త్వరలోనే వివాహం చేసుకోబుతున్నారా అని అడిగితే.. 

సుశాంత్ నేను మంచి ఫ్రెండ్స్ మాత్రమే, అక్కడి వరకే తమ బంధాన్ని చూడండి.. ఇప్పట్లో పెళ్లి చేసుకోలేను అంటూ మీనాక్షి సుశాంత్ తో పెళ్లి విషయమై సరైన క్లారిటీ ఇవ్వకపోయినా.. ఆమె ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యే ఉద్దేశ్యంలో లేదు అనేది ఆమె కెరీర్ అంటే ఒప్పుకున్న సినిమాలు చూస్తే అర్ధమవుతుంది. 

Sushant to marry Meenakshi Chaudhary:

Rumours Debunked: Meenakshi Chaudhary Not Marrying Sushanth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs