Advertisement
Google Ads BL

వైసీపీ కోసం ప్రాణం పెట్టింది.. కానీ..


పాపం శ్రీ రెడ్డి వైసీపీ పార్టీ కోసం ప్రాణం పెట్టి పని చేసింది. గత ఐదేళ్లుగా వైసీపీ పార్టీ కి కార్యకర్తగా, సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా శ్రీ రెడ్డి వైసీపీ కోసం ప్రతి నిమిషము ప్రతి పక్షాలను అడ్డమైన తిట్లు తిట్టింది. ఆల్మోస్ట్ ప్రాణం పెట్టి పని చేసింది. శ్రీ రెడ్డి తిట్టిన తిట్లు ఏ వైసీపీ నేత కానీ, కార్య కర్త కాని వైసీపీ అంటే ప్రాణమిచ్చే వాళ్ళు కానీ బాబు, లోకేష్, పవన్ లను అలా తిట్టలేదు. 

Advertisement
CJ Advs

కానీ శ్రీ రెడ్డి జగన్ అన్న కోసం అన్ని చేసింది. ఇప్పుడు ఆమెను పోలీసులు అరెస్ట్ చేసేందుకు రెడీ అవ్వగా అంటే కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో హద్దులు దాటి ప్రవర్తించిన వాళ్ళను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసి అప్పుడే పని మొదలు పెట్టింది. అందులో భాగంగా శ్రీ రెడ్డికి నోటీసులు వచ్చాయి. ఆమె అరెస్ట్ తథ్యం అంటున్నారు. 

ఈలోపులో శ్రీ రెడ్డి చంద్రబాబు, లోకేష్, పవన్ లని క్షమించండి అంటూ వీడియో మాత్రమే కాదు, రెండు లెటర్స్ రాసింది.. లోకేష్ అన్నా వదిలెయ్యండి అని. తనని వైసీపీ నేతలెవరైనా కాపాడుతారేమో అనుకున్న శ్రీ రెడ్డికి వైసీపీ పార్టీ షాకిచ్చింది. అసలు శ్రీ రెడ్డికి మాకు సంబందం లేదు, ఆమెని మేము పార్టీ కోసం పని చెయ్యమనలేదు అంటూ గుడివాడ అమర్నాధ్ తో ప్రెస్ మీట్ పెట్టించారు. 

నిన్నటివరకు శ్రీ రెడ్డి చంద్రబాబు, లోకేష్ లను వైసీపీ కోసం తిడితే సంతోషపడి జీతం ఇచ్చిన వారు, ఆమెను ఆపలేని నేతలు ఇప్పుడు ఆమె అరెస్ట్ అవుతుంది అని గ్రహించి ఆమెతో మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పడం శ్రీ రెడ్డికి షాక్ కాక ఇంకేమిటి. 

She gave her life for YCP.. but..:

The YCP party is getting rid of Sri Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs