జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఓడిపోయాక చాలారోజులు బెంగుళూరు ప్యాలెస్ లోనే విశ్రాంతి తీసుకున్నారు. ఆ తరవాత జగన్ ఎక్కువగా తన నేతలు జైల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికే బయటికి వచ్చారు. పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఈవీఎం బాక్స్ లు నాశనం చేసిన కేసులో జైలుకెళితే పరామర్శించడానికి జగన్ బెంగుళూరు నుంచి పనిగట్టుకుని జైలుకు వచ్చారు.
ఆ తర్వాత నందిగం సురేష్ హత్య కేసులో, టీడీపీ ఆఫీస్ ధ్వంశం కేసులో జైలు పాలయ్యాడు. అప్పుడు నందిగం సురేష్ ని జైలుకు పోయి పరామర్శించి వచ్చారు జగన్. దానితోనే జగన్ జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు అంటూ చాలామంది కామెడీగా మట్లాడారు. బోరుగడ్డ అనిల్ జైలుకెళ్లాక జగన్ రెస్పాన్స్ కోసం చాలా ఎదురు చూసారు. జగన్ అనిల్ ని పరామర్శించడానికి వెళతారా, లేదా అని.
ఇక ఇప్పుడు జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వకుండా జైళ్ల చుట్టూ తిరుగుతాడేమో చూడాలి. కారణం వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సోషల్ మీడియా యాక్టీవిస్టులను కూటమి ప్రభుతం వరసగా అరెస్ట్ లు చేస్తుంది. ఇప్పటికే వర్ర రవిందరా రెడ్డి, ఇంటూరి రవి కిరణ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిన్న మరికొందరిని అరెస్ట్ చెయ్యడమే కాదు జగన్ అంటే పడి చచ్చిపోయే రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి, పోసానిల అరెస్ట్ లు ఖాయమయ్యాయి. వీరందరికి పోలీసులు నోటీసులు పంపారు. మరి వీరంతా జైలుకు పొతే జగన్ వెళ్లి వాళ్ళను కూడా పరామర్శించి వస్తారా అనేది ప్రస్తుతానికి నడుస్తున్న హాట్ టాపిక్.