Advertisement
Google Ads BL

ప్రభాస్ ఆరడుగుల బంగారం


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళని వ్యక్తి. పర్సనల్ లైఫ్ లో పెళ్లి చేసుకోకపోవడం తప్ప ప్రభాస్ విషయంలో పేరు పెట్టడానికి ఏమి ఉండదు. తన పనేదో తాను చేసుకోవడం, ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చెయ్యడం, అప్పుడప్పుడు వెకేషన్ అంటూ జాలీగా ఇటలీ వెళ్లి రావడం తప్ప ప్రభాస్ మిగతా ఏ విషయాల్లోనూ జోక్యం చేసుకోరు. 

Advertisement
CJ Advs

అందుకే అల్లు అర్జున్ ప్రభాస్ ని ఆరడుగుల అందగాడు అంటూ పొగడడం సోషల్ మీడియాలో తెగ హైలెట్ అయ్యింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వస్తోన్న ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 4 లో అల్లు అర్జున్ రేపు రాబోయే ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చారు. బాలయ్య టాక్ షో లో తన భార్య స్నేహ రెడ్డి అనే వెపన్ వలన మారాను అంటూ సరదాగా చెప్పిన ప్రోమో కాకుండా తాజాగా ఆహా వారు అల్లు అర్జున్ ఎపిసోడ్ ప్రోమో ఒకటి వదిలారు. 

అందులో ముఖ్యంగా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ కి ఉన్న వివాదం గురించి ప్రశ్నించగా అల్లు అర్జున్ ఇచ్చిన ఆన్సర్ ను మ్యూట్ చేసారు ఆ తర్వాత బాలయ్య ప్రభాస్ గురించి అడగ్గానే ప్రభాస్ ని ఎప్పుడు చూసినా సర్.. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు నాదొక్కటే మాట ఆరడుగుల బంగారం అంటూ అల్లు అర్జున్ ఆహా అన్ స్టాపబుల్ షో లో ప్రభాస్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Allu Arjun Superb Words About Prabha:

Allu Arjun crazy comments on Prabhas 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs