Advertisement
Google Ads BL

నందమూరి ఫ్యాన్స్ వర్రీ అవ్వకండి


నిజమే నందమూరి అభిమానులు మీరు వర్రీ అవ్వకండి.. ఎందుకంటే నిన్నటివరకు నందమూరి వారసుడు మోక్షజ్ఞ మూవీని ప్రకటించిన ప్రశాంత్ వర్మ.. మోక్షు సినిమాని పక్కనపెట్టి జై హనుమాన్ పనులు చూసుకుంటున్నాడు అంటూ దిగులు పడిన అభిమానులను.. ఇప్పుడు వర్రీ అవ్వకండి అని ఎందుకంటున్నారో తెలుసా.. 

Advertisement
CJ Advs

ప్రశాంత్ వర్మ బాలకృష్ణ గారి కొడుకు మోక్షజ్ఞ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నాను అని చెప్పడమే. గత రాత్రి ప్రశాంత్ వర్మ సత్యదేవ్ జిబ్రా మూవీ ట్రైలర్ లాంచ్ కి గెస్ట్ గా వచ్చారు. ఆ ఈవెంట్ లో ప్రశాంతవర్మ మాట్లాడుతూ.. నేను మోక్షజ్ఞ సినిమా పనుల్లో, జై హనుమాన్ పనుల్లో బిజీగా వున్నాను అని చెప్పాను, కానీ చిరు గెస్ట్ గా వస్తున్నారు అనగానే ఆయన పనులు ముందు మనమెంత అని వచ్చేసాను అంటూ చెప్పడంతో నందమూరి అభిమానులు రిలాక్స్ అవుతున్నారు. 

లేదంటే ప్రశాంత్ వర్మ ఎక్కడ మోక్షు సినిమాని పక్కనపెట్టి జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీ అయ్యాడో అని కంగారు పడిపోయారు. వారి కంగారులో తప్పులేదు లెండి.. సింబా అంటూ మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ రివీల్ చేసాక ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అప్ డేట్స్ వదలడంలో తలమునకలై ఉన్నారు. అదీ వర్రీకి అసలు కారణం. కానీ ఇప్పుడు ప్రశాంత్ వర్మే చెప్పారు మోక్షు సినిమా పనుల్లో బిజీగా వున్నాను అని. సో అందుకే వర్రీ అవ్వద్దు అభిమానులు.. 

Nandamuri fans dont worry:

Director Prasanth Varma Massive Update On Mokshagna movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs