దేవర చిత్రం విడుదలైన రోజు సోషల్ మీడియాలో తీవ్ర నెగిటివిటీని ఎదుర్కొంది. కొరటాల శివ పై ఉన్న అసంతృప్తిని దేవర చిత్రం పై చూపించారు. దేవర చిత్రంలోని లోటుపాటులు ఎత్తి చూపించారు. కానీ రెండో రోజుకి దేవర చిత్రం నెగిటివిటి తుడిచిపెట్టుకుపోయేలా చెయ్యడంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సక్సెస్ అయ్యారు. అదే ఊపులో దేవర 500 కోట్ల క్లబ్బులు అడుగుపెట్టేలా చెయ్యడంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కృషి చెప్పనలవి కాదు.
దేవర థియేటర్స్ లో ఆడేసింది ఓకె. మరి గత శుక్రవారం నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ అయిన దేవర ఓటీటీ రెస్పాన్స్ ఏమిటో.. నెట్ ఫ్లిక్స్ లో దేవర ట్రెండ్ అయ్యిందా అనే విషయంలో కొంతమంది పనిగట్టుకుని చర్చ పెడుతున్నారు. అయితే దేవర కి థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ కి ఓటీటీ లో వచ్చిన రెస్పాన్స్ కి అస్సలు సంబంధం లేదు.
ఓటీటీలో దేవర ని వీక్షించాక కొరటాల శివ పై మళ్ళీ మీమ్స్ మొదలయ్యాయి. కొరటాల దర్శకత్వంలోని తప్పొప్పులను లెక్కలు కడుతున్నారు. దేవర తో ఎన్టీఆర్ స్టామినా ప్రూవ్ అయ్యింది లేకుంటే కొరటాల దేవర చిత్రాన్ని ఏం చేసేవాడో అని మ్లాడుతున్నారు. అయితే చాలా సినిమాలు థియేటర్స్ లో హిట్ అయినా.. ఓటీటీలో సత్తా చాటలేవు. ఇప్పుడు దేవర పరిస్థితి ఏమిటి అనేది ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చినట్టే..