Advertisement
Google Ads BL

జపాన్ కి పయనమవుతున్న మెగాస్టార్


మెగాస్టార్ చిరంజీవి రెండు రోజుల క్రితమే మాల్దీవుల నుంచి తిరిగి హైదరాబాద్ కి వచ్చారు. మాల్దీవులలో జరిగిన ఓ వ్యాపారవేత్త బర్త్ డే వేడుకల కోసం మెగాస్టార్ చిరు, వెంకటేష్, నాగార్జున, చరణ్, మహేష్, అఖిల్ వెళ్లారు. అక్కడ బర్త్ డే పార్టీ ని ఎంజాయ్ చెయ్యడమే కాదు మాల్దీవుల్లోనే మూడునాలుగు రోజులు గడిపి వచ్చారు. 

Advertisement
CJ Advs

నిన్న మంగళవారం చిరు సత్యదేవ్ జిబ్రా ట్రైలర్ లాంచ్ లో మెరిశారు. మెగాస్టార్ ఈ బుధవారం జపాన్ కి పయనమవుతున్నారు. అయితే ఈసారి జపాన్ కి ఏ ఫ్యామిలీ వెకేషన్ కో అనుకునేరు. జపాన్ కి వెళ్ళేది విశ్వంభర షూటింగ్ కోసమట. చిరంజీవి-వసిష్ఠ కాంబో లో తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రం జనవరి 10 నుంచి నుంచి పోస్ట్ పోన్ అయ్యి మే కి వెళ్ళింది. అందుకే హడావిడి లేకుండా వసిష్ఠ విశ్వంభర షూటింగ్ తో పాటుగా విఎఫెక్స్ పనులను కూల్ గా చక్కబెడుతున్నారు. 

విశ్వంభర లో కొద్దిమేర షూటింగ్ బాలన్స్ ఉండడంతో ఆ షెడ్యూల్ ని వసిష్ఠ జపాన్ లో ప్లాన్ చెయ్యడంతో చిరు జపాన్ కి పయనమవుతున్నారు. అక్కడ జపాన్ లో చిత్రీకరించే సన్నివేశాలు విశ్వంభరలో మేజర్ హైలెట్స్ గా నిలుస్తాయని టాక్. 

Megastar is going to Japan:

Megastar Chiranjeevi travelling to Japan!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs