నవంబర్ 31 దీపావళి స్పెషల్ గా విడుదలైన అమరన్ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. శివ కార్తికేయన్-సాయి పల్లవి జంటగా తెరకెక్కిన అమరన్ విడుదలకు ముందు ఈ చిత్రం ఎంత బావున్నా దీనిని ఓటీటీలో చూస్తారు కానీ పేక్షకులు థియేటర్ కి వెళ్ళరు అన్నారు. కానీ అమరన్ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
దాదాపుగా 250 కోట్లు కొల్లగొట్టిన అమరన్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ పై ఫ్యామిలీ ఆడియన్స్ లో తెగ క్యూరియాసిటీ నడుస్తుంది. ఓటీటీలోకి అమరన్ ఎప్పుడొస్తుంది.. ప్రస్తుతం నడుస్తున్న ఓటీటీ ట్రెండ్ ప్రకారం అమరన్ విడుదలైన నాలుగు వారాల్లో ఓటీటీ కి రావాలి కదా అని ఆరాలు మొదలు పెట్టారు.
అమరన్ ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో కొనేసిన నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు అమరన్ చిత్రాన్ని నెలలోపులోనే ఓటీటీకు తీసుకొచ్చే రూల్ కి బ్రేకులు వేసింది అనే టాక్ వినిపిస్తోంది, మరో రెండు వారాలు అదనంగా థియేటర్స్ లో ఆడిన తర్వాతే అంటే అమరన్ థియేటర్స్ లో విడుదలైన ఆరు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చెయ్యాలని అనుకుంటుందట.
అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రావాల్సిన అమరన్ డిసెంబర్ మూడో వారానికి షిఫ్ట్ అవ్వోచ్చేమో.. సో అమరన్ ఓటీటీలో చూడాలంటే కాస్త ఆగాల్సిందే సుమీ..!